గ్యాంగ్ రేప్‌నకు ఆర్డర్స్: 13 మందికి 20 ఏళ్లు జైలు

వివరాలు ఇలా ఉన్నాయి - మరో వర్గానికి చెందిన మహిళతో ఓ వ్యక్తి సంబంధం పెట్టుకున్నాడు. అందుకు శిక్షగా బాలికపై సామూహిక అత్యాచారానికి కంగారూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 21వ తేదీన గ్రామ పెద్దలు సంబంధం పెట్టుకున్న అనుమానించిన మహిళను, వ్యక్తిని పంచాయతీకి పిలిచారు.
వారిని చెట్టుకు కట్టేశారు. ఒక్కొక్కరు 25 వేల రూపాయలు జరిమానా కట్టాలని ఆదేశించారు. అయితే, తాము జరిమానా చెల్లించలేమని మహిళ కుటుంబ సభ్యులు చెప్పారు. దాంతో మహిళను బలవంతంగా గుడిసెలోకి తీసుకుని వెళ్లి పది మంది ఆమెపై అత్యాచారం చేశారు.
గ్రామ పెద్ద ఆదేశాలతో పది నుంచి 12 మంది తనపై అత్యాచారం చేశారని, వరుసగా అత్యాచారం సాగించారని, తనపై ఎన్నిసార్లు అత్యాచారం జరిగిందో కూడా తాను లెక్కించలేకపోయానని మహిళ చెప్పింది.












Click it and Unblock the Notifications