నీటి కుంటలో పడిన బస్సు: 13మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లాం వద్ద ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 40మంది ప్రయాణికులతో కొండదారి గుండా వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిపోయింది.
కుంటలో నీళ్లు బాగా ఉండటంతో బస్సు నీటిలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బస్సును క్రేన్ల సహాయంతో బయటకు తీసేందుకు యత్నించారు.
Madhya Pradesh: Bus carrying more than 40 people falls into a gorge in Ratlam. Rescue op underway. pic.twitter.com/FVXBMdnRfH
— ANI (@ANI_news) October 14, 2016
బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటికి తీశారు. 13మంది ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోగా, 17 మంది ప్రయాణికులు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications