విషాదం : ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైకి దూసుకెళ్లిన ట్రక్కు... 15 మంది మృతి
గుజరాత్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సూరత్‌లోని కోసాంబ ప్రాంతంలో ఓ ట్రక్కు ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లడంతో... దానిపై నిద్రిస్తున్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం(జనవరి 18) అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతులంతా కూలీలు అని... రాజస్తాన్‌లోని బాన్స్వాడా జిల్లా నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చారని చెప్పారు. ప్రమాద సమయంలో అంతా గాఢ నిద్రలో ఉన్నారని చెప్పారు. మొదట ఆ ట్రక్కు చెరుకు లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిందని... దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లాడని చెప్పారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Gujarat: 13 people died after they were run over by a truck in Kosamba, Surat.
— ANI (@ANI) January 19, 2021
Police says, "All the deceased are labourers and they hail from Rajasthan." pic.twitter.com/E9uwZnrgeO
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications