ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి.. నుజ్జునుజ్జయిన కార్లు..
కర్ణాటకలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూమకూరు జిల్లా కొణిగల్ సమీపంలోని బెంగళూరు-మంగళూరు హైవేపై రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. బెంగళూరు నుంచి ధర్మస్థలం వెళ్తున్న ఓ బ్రీజా కారు.. అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం.. కారు పల్టీలు కొడుతూ వెళ్లి ఎదురుగా వస్తున్న చెవర్‌లెట్ కారును ఢీకొట్టింది. బ్రీజా కారులో ఉన్నవారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. చెవర్‌లెట్ ఉన్నవారిలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

Recommended Video

ప్రమాద సమయంలో ఒక కారులో 10 మంది మరో కారులో 12 మంది ఉన్నట్టు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.మృతుల కుటుంబాల సమాచారం అందించి.. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి.












Click it and Unblock the Notifications