వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర ప్రమాదం: మహిళతోపాటు 13మంది మృతి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. చిత్రదుర్గ సమీపంలోని మందనాయకలహళ్లిలో ఓ ట్రక్కు అదుపుతప్పడంతో 13మంది ప్రాణాలు కోల్పోయారు.

స్టీల్‌రాడ్‌ల లోడుతో వెళ్తున్న ట్రక్కు ఎదురుగా వస్తున్న టాటా ఏస్‌ వాహనంపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు.

ట్రక్కు భారీ లోడ్‌తో వెళ్తుండటంతో డ్రైవర్‌ కంట్రోల్‌ చేయలేకపోయాడని పోలీసులు చెప్పారు. స్టీల్‌రాడ్‌ల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను క్రేన్‌ సాయంతో వాటిని వెలికితీసినట్లు పేర్కొన్నారు. మృతులంతా కొడగవల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

 13 killed in Karnataka road accident

ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతం

జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో శుక్రవారం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ మేరకు పోలీసులు శుక్రవారం రాంచీలో వెల్లడించారు. మృతదేహాల వద్ద నుంచి ఏకే 37రైఫిల్ తోపాటు మరో తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రత సిబ్బంది కూడా గాయపడ్డారని చెప్పారు. వారు రాంచీలోని ఆస్పపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. మృతి చెందిన మావోయిస్టుల్లో మహిళ కూడా ఉందని తెలిపారు. భద్రత దళాలు.. మావోయిస్టుల మధ్య గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పారు.

మరోవైపు చత్తీస్‌గఢ్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ చనిపోయాడు. కడేగావ్‌లోజరిగిన ఈ ఎదురు కాల్పుల్లో రెండు తుపాకీలను, నక్సల్ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

English summary
At least 13 persons, including one women and two children, were killed in a road accidentwhich took place early this morning on National Highway-13. The incident took place when a speedy truck loaded with iron bar dashed with a Tata Ace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X