విషాదం: పొగ మంచుకు 13 మంది టీచర్లు బలి
పొగ మంచు పంజాబ్‌లో 13 మందిని బలి తీసుకుంది. పొగ మంచు కారణంగా రెండు వాహనాలు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది టీచర్ల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
చండీఘర్: పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగ మంచు కారణంగా చూపు సరిగా ఆనకపోవడంతో రెండు వాహనాలు ఢీకొని ప్రమాదం సంభవించింది. టీచర్లు ప్రయాణిస్తున్న వాహనం ట్రక్కును ఢీకొట్టింది. దీంతో 13 మంది టీచర్లు మృత్యువాత పడ్డారు.
చండీఘర్‌కు 320 కిలోమీటర్ల దూరంలో గల ఫజిల్క, ఫిరోజ్‌పూర్ జాతీయ రహదారిపై గల చాంద్మజ్రి గ్రామ సమీపంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. మృతుల్లో మహిళా టీచర్లతో పాటు కొత్తగా చేరినవారు కూడా ఉన్నారు.

మృతులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. తమ సంస్థలకు వెళ్తున్న క్రమంలో వారు ప్రమాదానికి గురయ్యారు. ఫజిల్లా, అబోర్ బెల్ట్‌కు చెందిన 15 మంది టీచర్లు వాహనంలో ఉన్నారు. ట్రక్కు డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
టీచర్లు తమ తమ పాఠశాలలకు ప్రతి రోజూ అదే వాహనంలో వెళ్తుంటారు. ప్రమాదం ఉదయం గం.8.15 నిమిషాలకు జరిగింది. ట్రక్కు డ్రైవర్ టీచర్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని దాటేసి వెళ్లడానికి ప్రయత్నించి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications