అత్యధిక కరోనా కేసులు నమోదు : అప్రమత్తం - కీలక సూచనలు..!!
మరోసారి కరోనా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. 140 రోజుల తరువాత అత్యధిక కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 1,300 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. మహమ్మారి వల్ల ముగ్గురు మరణించారు. కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తున్న ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. కరోనా ఇంకా ముగియలేదని స్పష్టం చేసారు.
దేశ వ్యాప్తంగా తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,300 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు అయిదు నెలల తరువాత ఈ స్థాయిలో కేసుల సంఖ్య పెరిగింది. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. కరోనా పైన సమీక్షించిన ప్రధాని మోదీ కరోనా ఇంకా ముగియలేదని వ్యాఖ్యానించారు. అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన అవసరముందన్నారు. ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం-ల్యాబ్ టెస్టింగ్ అనే ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్ధరించుకునేందుకు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సూచించారు.

ఏమైనా కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయేమో గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ లేబొరేటరీల సంఖ్యను పెంచాలని ప్రధాని మోదీ ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే అన్ని రాష్ట్రాలను కొవిడ్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో రోగులు, వైద్యులు, ఇతర సిబ్బంది మాస్క్ ధరించడం వంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకో వాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ 6 రాష్ట్రాలకు అడ్వయిజరీ జారీ చేసింది. ఈ అడ్వయిజరీ జారీ చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇన్ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.













Click it and Unblock the Notifications