మత ఘర్షణలు: ముగ్గురు సజీవ దహనం, 14 మంది అరెస్టు
పాట్నా: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేసినట్లు ముజఫర్‌పూర్ డీఎం అనుపమ్ కుమార్ తెలిపారు. పరిస్ధితి అదుపులో ఉన్నట్లు ఆయన తెలిపారు.
వివరాల్లోకి వెళితే ఓ వర్గానికి చెందిన యువతి... మరో వర్గానికి చెందిన యువకుడితో లేచిపోయింది. ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. దాంతో ఆగ్రహించిన మృతుని బంధువులు, గ్రామస్తులు అజీజ్‌పూర్‌పై దాడి చేసి, ఇళ్లకు నిప్పుపెట్టి... పలు వాహనాలను ధ్వంసం చేశారు.

ఇరు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు సజీవ దహనమయ్యారు. దీంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారటంతో భారీగా పోలీసులను మోహరించారు. ఈ మత ఘర్షణల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు జిల్లా అధికారులు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా, కాలిబూడిదైన ఇళ్లకు రూ. లక్ష, సుమారు 20 ఇళ్లలో నివసిస్తున్న 57 కుటుంబాలకు... ఒక్కో కుటుంబానికి రూ. 42,000వేలు ప్రకటించారు. ఈ ఘర్షణల్లో ఇళ్లు కొల్పోయిన వారి కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఘర్షణలపై బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ దర్యాప్తుకు ఆదేశించారు. ఇద్దరు సభ్యులతో కూడిన దర్యాప్తు బృందానికి ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సుధీక్ కుమార్ నేతృత్వం వహించనున్నారు.












Click it and Unblock the Notifications