"డైలీ 14 గంటలు ఆఫీస్.. అర్ధరాత్రి 2:45 కు కూడా రిప్లై ఇవ్వాలి"
ఓ 24 ఏళ్ల ఉద్యోగిని తన ఆఫీస్ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అధిక వర్క్, టాక్సిక్ మేనేజ్ మెంట్ గురించి చెప్పుకొచ్చింది. టాప్ ఏయూఎం కంపెనీలో ఇలాంటి రూల్స్ పై ఆమె అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ విషయాన్ని రెడ్డిట్ మాధ్యమం వేదికగా పోస్టు చేసింది. ఈ పోస్టుతో భారత్ లోని కార్పొరేట్ వ్యవస్థపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రోజుకు 14 గంటలపాటు వర్క్ కారణంగా తాను మానసికంగా, ఎమోషనల్ గా ఇబ్బంది పడినట్లు తెలిపారు. వీకెండ్స్ లోనూ పనిభారం పెట్టారని.. 24 గంటలపాటు లీడ్ కు రెస్పాండ్ అవుతూనే ఉండాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
" నా టీమ్ లీడ్ అర్ధరాత్రి 2:45 కు నానుంచి రిప్లై కోరుకున్నాడు. అప్పటికే 14 గంటల షిఫ్ట్ ముగిసింది. ఐ యామ్ డన్" అని మెసేజ్ పెట్టారు. లీడ్.. మెసేజ్ పెట్టినప్పుడు తాను నిద్రలో ఉన్నానని.. అందుకు పరిహారంగా తనమీద సుపీరియర్ కు ఫిర్యాదు చేసి క్షమాపణలు చెప్పించుకున్నారని ఆ ఉద్యోగిని పేర్కొన్నారు. అయితే గతంలోనూ లీడ్ పై చాలాసార్లు పై వాళ్లకు ఫిర్యాదు చేసినా.. ఆఫీస్ లో లీడ్ పలుకుబడి కారణంగా అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. " నేను మెంటల్ గా డ్రైయిన్ అయ్యాను. ఆత్రుతతో ఉన్నాను. ఇంకా నేను ఇది ఎందుకు చేస్తున్నాను.. అని హానెస్ట్ గా ప్రశ్న వేసుకుంటున్నాను" అని ఆ ఉద్యోగిని రెడ్డిట్ లో పోస్టు చేసింది.
మొత్తానికి ఈ పోస్టు హై- ప్రెజర్ కార్పొరేట్ వ్యవస్థలో పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితులను స్పష్టం చేస్తోంది. పర్సనల్ బౌండరీలను దాటి ప్రవర్తించాల్సి ఉంటుంది.." నేను గతంలో ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసేదాన్ని.. కానీ ఇప్పుడు ల్యాప్ టాప్ ఓపెన్ చేసే పరిస్థితి కూడా లేదు" అని ఆ ఉద్యోగి పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే కంపెనీలో ఉండాలా..? లేక మరో అవకాశం కోసం వెళ్లాలా..? అన్న సందిగ్ధంలో ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఇదే పోస్టుపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. టాక్సిక్ లీడర్ షిప్, పట్టించుకోని మేనేజ్ మెంట్, మెంటల్ హెల్త్, ఉద్యోగుల హక్కులు, వర్క్- లైఫ్ బ్యాలెన్స్ తదితర అంశాలపై కామెంట్స్ పెడుతున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications