భారీ ఎన్‌కౌంటర్: 14మంది మావోయిస్టుల మృతి
సుకుమా: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఉదయం నుంచి పోలీసులు జరుపుతున్న ఎదురుకాల్పుల్లో 14మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కొంట పీఎస్ పరిధిలోని గొల్లపల్లి కన్నాయిగూడ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్లు ఆ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తున్నారు.

మావోయిస్టుల మృతిని పోలీసులు ధృవీకరించారు. ఘటనా స్థలం నుంచి 16 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(యాంటీ నక్సల్ ఆపరేషన్స్) డీఎం అవాస్థి తెలిపారు.












Click it and Unblock the Notifications