ముంబైలో భారీ అగ్నిప్రమాదం: 15 మంది దుర్మరణం

Posted By:
Subscribe to Oneindia Telugu
Mumbai Kamala Mills Fire : ముంబై అగ్ని ప్రమాదం: కుష్బూ మృతి

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లోయర్‌పరేల్‌లో గల కమల మిల్స్‌ కాంప్లెక్స్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు. మరో 12 మందికి గాయాలయ్యాయి.

కాంప్లెక్స్‌‌లోని లండన్‌ టాక్సీ గ్యాస్ట్రో పబ్‌లో మొదట మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నస్తున్నారు.

Fire accident

విద్యుత్‌ షార్ట్‌ స‌ర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. మూడంతస్థుల భవనంలో ఈ మంటలు చెలరేగాయి.

మృతుల్లో 12 మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సముదాయంలో కార్యాలయాలు, రెస్టారెంట్లు ఉన్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
15 people including 12 women died and nearly a dozen were injured in a major fire late on Thursday night at Mumbai's Kamala Mills compound that houses several offices and restaurants.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి