మామిడి పండు దొంగిలించినందుకు చంపేశాడు

షేక్ షెదుల్ మామిడి పండ్ల బండి దగ్గరికి వచ్చిన ఓ పదిహేనేళ్ల బాలుడు, రూ.10 కి పండివ్వమని అడిగాడు. అయితే ఆ బాలుడు రూ.10 నోటును ఇవ్వకపోవడంతో షేక్ కూడా మామిడి పండు ఇవ్వలేదు. ఈ క్రమంలో కొనుగోలుదారులతో షేక్ బిజీగా ఉండగా, బాలుడు ఓ మామిడి పండు తీసుకుని జేబులో వేసుకున్నాడు. దీనిని గమనించిన షేక్ ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు.
ఇనుపరాడ్డుతో బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన షేక్ అక్కడినుంచి పరారయ్యాడు. గాయాలపాలైన బాలుడు మృతి చెందాడు. షేక్‌ను పట్టుకోవాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications