నిద్రిస్తున్న అమ్మాయిని లాక్కెళ్లి గ్యాంగ్‌రేప్ చేశారు

పోలీసుల కథనం ప్రకారం.. ఎండ వేడిమి తట్టుకోలేక మంగళవారం సాయంత్రం బాధిత యువతి రైల్వే స్టేషన్‌లో పడుకుంది. కాగా, స్థానికంగా కూరగాయలు అమ్ముకునే జకీర్ హుస్సేన్, అక్తర్ మోల్లా, సురజిత్ చౌదరిలు ఆమెను బలవంతంగా సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. వీరితోపాటు మరో యువకుడు కూడా కలిశాడు.
కేకలు వేయకుండా ఆమె నోట్లో గుడ్డలు కుక్కారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీసులు, మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఏడో తరగతి విద్యార్థినిపై యువకుడు రేప్
ముంబై: ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని(14)పై 25ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బాలిక ఐదు నెలల గర్భవతి అయిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించారు.












Click it and Unblock the Notifications