Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జై శ్రీరాం అనకుంటే ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు

చందౌలి : హిందుత్వం పేరుతో దాడులు పెరిగుతున్నాయి. ముఖ్యంగా యూపీలో హిందుత్వ వాదులు రెచ్చిపోతున్నారు. జై శ్రీరాం, జై హనుమాన్ అనాలని బెదిరిస్తున్నారు. అలా అనకుంటే దాడులు చేస్తున్నారు. మరికొందరు తీవ్రంగా కొట్టడంతో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని చందౌలిలో కూడా అలాంటి ఘటనే జరిగింది. ఓ ముస్లిం యువకుడిపై నలుగురు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపుతోంది. అయితే దీనిపై పోలీసులు భిన్న వాదనలే చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

యూపీలోని చందౌలి జిల్లాకు చెందిన ఓ 15 ఏళ్ల ముస్లిం యువకుడిని నలుగురు యువకులు అడ్డుకున్నారు. అతనిని ఆటకాయించి జై శ్రీరాం అనాలని ఒత్తిడి చేశారు. అయితే ఇందుకు ఆ యువకుడు నిరాకరించాడు. ఇంకేముంది తమ ప్రతాపం చూపారు. అతనిని పట్టుకొని కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. మంటలతో హహకారాలు చేస్తూ ఎలాగోలా ఇంటికి చేరిపోయాడు. అతడిని కాశి కబీర్ చౌరా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే యువకుడి ఒంటిపై 60 శాతం గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అతని పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నారు.

15-year-old Muslim boy set on fire not chanting Jai Shri Ram

యువకుడి ఆరోపణలు ఇలా ఉంటే పోలీసులు తీరు మాత్రం విచిత్రంగా ఉంది. జరిగిన ఘటన ఇదీ కాదని వారు చెప్తున్నారు. యువకుడు డుదారి బ్రిడ్జి వద్ద నలుగురు కిడ్నాప్ చేశారని మీడియాకు తెలిపారని వివరించారు. అందులో ఇద్దరు అతని చేతులను కట్టేశారని పేర్కొన్నారు. మరొకరు కిరోసిన్ పోసి నిప్పంటించారని .. అక్కడినుంచి పరుగెత్తి ఇంటికొచ్చాడని తెలిపారు. అయితే అతని ఇంటికి వచ్చేసరికి కూడా మంటలతో యువకుడు కాలిపోతున్నాడని చెప్పారు. అయితే యువకుడు, పోలీసుల వాదన విచిత్రంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+