16 మంది సస్పెక్టెడ్ డెత్.. మద్యంతోనేనా...? ఇద్దరు మాత్రం
బీహర్‌లో 16 మంది చనిపోయారు. పశ్చిమ చంపార్ జిల్లాలో గత 48 గంటల్లో మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. వీరంతా మందులో విషపూరిత పదార్థం కలుపడంతోనే చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇద్దరు చౌకీదారులను ప్రశ్నించి.. సస్పెండ్ చేశారు.

బీహర్‌లో 2016 నుంచి మద్యపాన నిషేధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఆల్కహల్ ఉత్పత్తి చేయడం, కొనుగోలు చేయడం, సేవించడం నేరమే అవుతుంది. ఆ 16 మంది చనిపోయిన వారి మృతదేహలు తీసుకోవడానికి కూడా జనం జంకుతున్నారు. ఎందుకంటే ఎక్కడ తమపై కేసులు పెడతారేమోనని భయం ఉంది.
గత రెండు మూడు రోజుల్లో 8 మంది అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అయితే వారంతా మందు తీసుకున్నారని కలెక్టర్ కుందన్ కుమార్ వివరించారు. 40 మంది నుంచి పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు. అయితే చనిపోయిన వారి కుటుంబసభ్యులు మాత్రం.. వారు లిక్కర్ తీసుకోలేదని చెబుతున్నారు. 16 మందిలో ఇద్దరికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి.. మిగతా 14 మంది మాత్రం మద్యం సేవించడం వల్లే చనిపోయారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications