ఆప్ఘన్ టు ఇండియా: 16 మందికి కరోనా.. 14 రోజులు క్వారంటైన్
ఆప్ఘానిస్తాన్ నుంచి భారత్ చేరుకున్నవారిలో 16మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా సోకినవారిలో ఆరుగురు అప్ఘానిస్తాన్ సిక్కులు, హిందువులు కూడా ఉన్నారు. కోవిడ్ సోకినవాళ్లందరినీ ఢిల్లీలోని నఫాఘర్ లోని ఐటీబీపీ క్యాంప్‌లో 14 రోజులు క్వారంటైన్ లో ఉంచనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మంగళవారం కాబుల్‌లో చిక్కుకున్న 78 మందిని ప్రత్యేక విమానంలో వయా దుశాంబే భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సోమవారం ఆప్ఘానిస్తాన్ నుంచి భారత్ చేరుకున్నవారిలో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే.
ఆప్ఘాన్‌ను తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకున్న మరునాడు ఆగస్టు 16 నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. భారత్ ఇప్పటివరకు 800కిపైగా మందిని అప్ఘానిస్తాన్ నుంచి తీసుకొచ్చింది. వీరిలో భారతీయులతోపాటు అఫ్గాన్ సిక్కులు, హిందువులు కూడా ఉన్నారు. ఆప్ఘానిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే మిషన్‌కు 'ఆపరేషన్ దేవీ శక్తి అని' అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఇవాళ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రక్రియలో నిరంతరాయంగా శ్రమిస్తున్న భారత వాయుసేన, ఎయిర్ ఇండియా, విదేశాంగ శాఖ బృందానికి సెల్యూట్ అని జైశంకర్ ట్వీట్ చేశారు.

ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆప్ఘన్‌లో ఉన్న ప్రజలను సురక్షితంగా తరలించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆప్ఘన్‌లో ఉన్న హిందువులు, సిక్కులు స్వదేశం వస్తామని స్పష్టంచేశారు. 17వ తేదీ నుంచి భారత రాయబార కార్యాలయం ఇండియన్స్ తరలింపుపై ఫోకస్ చేసింది. మంగళవారం 78 మంది ఉన్నారు. వీరిలో 25 మంది ఆప్ఘన్ సిక్కులు, దుసాంబెకు చెందిన హిందువులు ఉన్నారు.
ఆప్ఘన్‌లో తాలిబాన్ల ఆటవిక పాలన కొనసాగుతోంది. దీంతో అక్కడ ఉండలేక వెళ్లేందుకు జనం విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఓ విమానంలో దాదాపు 600 మంది పైచిలుకు ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటపడేందుకు కాబూల్ విమానాశ్రయానికి ఇటీవల వేలాదిమంది వచ్చారు. విమానం రెక్కలపై కూర్చుని అయినా దేశం దాటాలని ప్రయత్నించి ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోటెత్తిన జనాన్ని అడ్డుకునేందుకు జరిపిన కాల్పుల్లో మరికొందరు బయలుదేరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. వేలాదిమంది విమానాశ్రయం బయట ప్రతి రోజూ పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే రాయల్ మెరైన్‌కు చెందిన యూకే మాజీ కామాండో పాల్ 'పెన్' ఫార్తింగ్ తన భార్య కైసాను ఖాళీ విమానంలో తరలించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనే ఈ ఫొటోలను షేర్ చేశారు. ఆమె ప్రయాణించిన 'సి-11 గ్లోబ్‌మాస్టర్' మిలటరీ విమానం ఖాళీగా ఉంది.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు.
Recommended Video
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications