దారుణం: 16 ఏళ్ళ బాలిక కిడ్నాప్, 9 రోజులపాటు గ్యాంగ్ రేప్

Posted By:
Subscribe to Oneindia Telugu

భువనేశ్వర్: ఒడిశాలో కిరాతకం జరిగింది తండ్రిపై కోపంతో 16 ఏళ్ళ కూతురును కిడ్నాప్ చేసి 9 రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటనలో వరుసకు సోదరుడయ్యే వ్యక్తి కూడ పాల్గొన్నారు.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ నెల 9వ, తేదిన అర్ధరాత్రి యువతి ఇంట్లో నిద్రిస్తుండగా ఓ వ్యక్తి తొలుత బాధితురాలని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. మరో నలుగురు ఆ సమయంలో ఆయనకు సహకరించారు.

gang rape

అనంతరం బాధితురాలిని చేతులు, కాళ్ళు కట్టేసి ఓ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి అమానుషంగా ప్రవర్తిస్తూ దాదాపు తొమ్మిదిరోజుల పాటు లైంగికదాడికి పాల్పడ్డారు.

దీంతో బాధితురాలు ఆమె తండ్రి కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక పోలీసులకు కాకుండా నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు.

అయితే స్థానిక పోలీసులపై నమ్మకం లేకనే ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు బాధితులు చెప్పారు.తన తండ్రిపై రాజకీయ కక్షతోనే తనపై లైంగికదాడికి పాల్పడినట్టు బాధితురాలు చెప్పారు. గత పంచాయితీ ఎన్నికల్లో నిందితులు వ్యతిరేకించిన వారికి తన తండ్రి మద్దతిచ్చినందుకే ఇలా చేశారని బాధితురాలు వాపోయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 16-year-old girl was allegedly gangraped by five people, including a cousin, for over a week in a forest in Odisha’s Ganjam district, police said on Tuesday
Please Wait while comments are loading...