పదహారేళ్ల అమ్మాయిపై నెల రోజులు మతబోధకుడి అత్యాచారం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ మతబోధకుడు కిరాతక చర్యకు ఒడిగట్టాడు. హుగ్లీలోని పునరావాస కేంద్రంలో 16 ఏళ్ల అమ్మాయిపై మత బోధకుడు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అమ్మాయిని చిత్రహింసలు పెట్టినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఆ సంఘటనపై ఓ ఎన్జీవో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గురప్ భస్తరా క్రిస్టియన్ హోమ్‌కు చెందిన మతబోధకుడు మైనర్ బాలికపై నెల రోజులుగా చిత్రహింసలకు గురి చేస్తూ, ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. ఏడాది కాలంగా బాధితురాలు ఆ హోమ్‌లో ఉంటోంది.

మతబోధకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై చిత్రహింసలు, అత్యాచారం కింద అభియోగాలు మోపారు. సంఘటనపై దర్యాప్తు చేయడానికి, పరిశీలించడానికి పోలీసు అధికారులను హోమ్‌కు పంపించినట్లు సదర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ సుదీప్ సర్కార్ చెప్పారు.
మతబోధకుడిని బుధవారంనాడు కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. బాధితురాలిని అదే జిల్లాలో ప్రభుత్వం నడిపే హోమ్‌కు తరలించారు. పశ్చిమ బెంగాల్ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు హోమ్‌ను సందర్శించి బాధితురాలిని, అందులోనివారిని విచారించారు.












Click it and Unblock the Notifications