పనిస్తామని తీసుకెళ్ళి .. 13 నెలలు బందీగా గ్యాంగ్ రేప్ .. నరకం చూసిన నేపాలీ బాలిక
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. పదహారేళ్ల బాలికకు పని ఇప్పిస్తామని తల్లిదండ్రులను నమ్మబలికి తీసుకెళ్ళి ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటుగా, బాలికను వేరువేరు పురుషులకు విక్రయించి ,13 నెలలకు పైగా బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కామాంధుల చెరనుండి బాలిక తప్పించుకుని బయటపడడంతో ఈ విషయం అందరికీ తెలిసింది.

మైనర్ బాలికపై సామూహిక లైంగిక వేధింపులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో మహా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో పదహారేళ్ల నేపాల్ బాలికను పని ఇప్పిస్తామని తీసుకువెళ్లిన ఒక స్కూల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేసే ఉప్రేతా కుమార్ అనే వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతను మాత్రమే కాకుండా ఆమెను అనేకసార్లు వేరువేరు పురుషులకు విక్రయించి వ్యభిచార రొంపిలోకి దించాడు. చిన్న పిల్ల అని కూడా చూడకుండా బాలికపై సామూహిక అత్యాచారాలకు విటులను పురికొల్పాడు.

తప్పించుకున్న బాలిక .. తీవ్ర అనారోగ్యం .. 5 నెలల గర్భవతి అయిన బాలిక
ఉప్రేతా కుమార్ తీరుతో నరకం అనుభవించిన బాలిక తనను బంధించిన ఇంటి నుండి పారిపోయి తల్లిదండ్రుల వద్దకు చేరింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించగా, ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక ఐదు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో బాలికపై జరిగిన దారుణాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.

నలుగురు అరెస్ట్ .. మిగతావారి కోసం గాలింపు .. పోక్సో చట్టం కింద కేసు నమోదు
మైనర్ బాలికను బందీగా ఉంచారు. అత్యాచారం చేసినందుకు 57 సంవత్సరాల ఉప్రేతా కుమార్ ను , 38 ఏళ్ళ జీతు కశ్యప్ ను , 47 సంవత్సరాల అజయ్ కుమార్ ను, 38 ఏళ్ల వరుణ్ తివారీ లను అరెస్ట్ చేశామని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దోషులకు శిక్ష పడేలా చేస్తామని చెబుతున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications