షాకింగ్: 16 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా 113 మంది రేప్

ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తన పైన గత రెండేళ్లుగా దాదాపు 113 మంది అత్యాచారం చేశారని పదహారేళ్ల బాలిక ఆరోపించింది. మహారాష్ట్రలోని పుణే నగరానికి తనను తీసుకు వచ్చిన వ్యక్తులు బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించారని, అక్కడ కొందరు పోలీసులతో సహా 113 మంది తనపై రేప్ చేశారని ఆరోపించింది.

గత నెలలో అక్కడి నుంచి తప్పించుకొని ఢిల్లీకి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. ఈ కేసును తాజాగా పుణేకు బదలీ చేసి, 113 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులో 26 ఏళ్ల మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

16 yr old girl complains of rape by 113, including policemen, over 2 years

ఇటీవలే ఓ మోడల్‌ను ఢిల్లీ నుంచి పుణే తీసుకు వచ్చి చిత్రహింసలు పెట్టి అత్యాచారయత్నం చేసిన కేసుకు, దీనికి కూడా సంబంధం ఉందని తెలుస్తోంది. సదరు మోడల్ ఈ పాపతోనే కలిసి ఢిల్లీకి పారిపోయింది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో నేపాల్‌కు చెందిన వారు కూడా ఉన్నారు.

బాలిక విషయానికి వస్తే... పశ్చిమ బెంగాల్ - నేపాల్ సరిహద్దులోని సిలిగురి ప్రాంతానికి చెందిన బాలిక తల్లిని ఆమె తండ్రి వదిలేశాడు. దాంతో ఆమె మతిస్థిమితం కోల్పోయింది.

వాళ్ల అమ్మమ్మకు టీ కొట్టు ఉండగా అక్కడకు భండారీ అనే వ్యక్తి తరుచూ వచ్చి సిగరేట్లు తీసుకునేవాడు. అప్పుడే బాలికను చూసి, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2014లో పుణే తీసుకు వెళ్లాడు. రెండేళ్లలో ఆమెపై 113 మంది అత్యాచారం చేశారు. కాగాత ఢిల్లీ నుంచి వచ్చిన 24 ఏళ్ల మోడల్‌తో కలిసి తర్వాత ఆమె ఢిల్లీకి పారిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+