దారుణం: 17 ఏళ్ళ బాలికపై గ్యాంగ్‌రేప్: ఆత్మహత్య

చండీఘడ్: 17 ఏళ్ళ బాలికను కిడ్నాప్ చేసి 8 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. గ్యాంగ్‌రేప్‌కు గురైన బాలిక అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకొంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హార్యానా రాష్ట్రంలోని నౌ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో అపస్మాకరస్థితిలో పడిఉన్న బాలికను పోలీసులు గుర్తించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

17-year-old girl abducted, raped by 8 men in Haryana; commits suicide

బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రెండు మోటార్‌ బైక్‌లు, కారులో వచ్చిన నిందితులు ఆమెను అపహరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలి తండ్రి పేర్కొన్నారు.

బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన అనంతరం స్పృహకోల్పోయిన స్థితిలో ఆమెను వదిలివేసిన నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. అపస్మారకస్థితిలో బాలికను గుర్తించి ఇంటికి తీసుకువచ్చిన పోలీసులు ఆమెను తల్లితం‍డ్రులకు అప్పగించారు. అయితే తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దేశంలో ఇటీవల కాలంలో ఈ తరహ అత్యాచారా ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి.

నిందితులను బాలిక గుర్తించిందని, వారు గతంలోనూ తమ కుమార్తె వెంటపడ్డారని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారని మెవాట్‌ ఎస్పీ నంజీన్‌ భాసిన్‌ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+