అమ్మాయిని లాడ్జీకి తీసుకెళ్లి.. మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి..
ఇద్దరు యువకులు ఓ అమ్మాయి(17)ని లాడ్జీకి తీసుకువెళ్లి ఆమెకు మత్తు మందు కలిపిన పానీయం తాగించి పలుమార్లు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన మహారాష్ట్ర కల్యాణ్ నగరం పరిధిలోని ఖడకపద ప్రాంతంలో వెలుగుచూసింది.
థానే : ఇద్దరు యువకులు ఓ అమ్మాయి(17)ని లాడ్జీకి తీసుకువెళ్లి ఆమెకు మత్తు మందు కలిపిన పానీయం తాగించి ఆపై పలుమార్లు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన మహారాష్ట్ర కల్యాణ్ నగరం పరిధిలోని ఖడకపద ప్రాంతంలో వెలుగుచూసింది.
ఖడకపద ప్రాంతానికి చెందిన ఆ అమ్మాయిని ఇద్దరు యువకులు ఇంటితోపాటు లాడ్జీ, గోదాం, గార్డెన్‌లకు తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఏడాది పిభ్రవరి నుంచి ఆగస్టు వరకు ఈ ఘోరానికి పాల్పడ్డారు.

ఏడు నెలల పాటు తనపై ఆ ఇద్దరు యువకులు పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారని బాధిత బాలిక కల్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మాయి ఫిర్యాదుపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 డి, 34, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications