వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ ముంబై నగరం

|
Google Oneindia TeluguNews

ముంబై: భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. నిత్యం అత్యాచారాలు జరుగుతుండటంతో మహిళలు హడలిపోతున్నారు. ముంబై నగరంలో మహిళలపై అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కేవలం మూడు నెలలలో 165 శాతం అత్యాచారాలు, కిడ్నాప్ లు పెరిగిపోయాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆర్టీఐ కార్యకర్త (సామాజిక కార్యకర్త) చేతన కొఠారి ముంబైలో జరుగుతున్న దారుణాలను వెళ్లడించారు.

ముంబై నగరంలో ఈ సంవత్సరం జనవరి నెల నుండి మార్చి నెల వరకు 172 అత్యాచారాల కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. గత సంవత్సరం జనవరి నెల నుండి మార్చి నెల వరకు 138 అత్యాచారాల కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు 43 శాతం రేప్ కేసులు పెరిగిపోయాయి.

172 cases of rape were registered in Mumbai

గత సంవత్సరం తొలి మూడు నెలలలో 76 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సంవత్సరం గత మూడు నెలలలో ఆ సంఖ్య 202కు పెరిగిపోయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తు అత్యాచారాలు చేశారని 95 శాతం కేసులు నమోదు అయ్యాయి.

5 శాతం మంది మహిళల మీద ఇతరులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారని పోలీసు అధికారులు అంటున్నారు. పిల్లలను తెలిసిన వారే ఎక్కువగా కిడ్నాప్ చేస్తున్నారని, ఆర్థికలావాదేవీల కారణంగా ఇలాంటి కేసులు నమోదు అవుతున్నాయని, జాగ్రతగా ఉండాలని ముంబైకి చెందిన ఒక ఐపీఎస్ అధికారి అంటున్నారు.

English summary
The data sought by activist Chetan Kothari showed 172 cases of rape cases were registered in January to March this year against 138 in the first three months of last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X