వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పసిడి కాంతులతో గణేశుడి ప్రతిమ.. ధగధగ లాడనున్న బొజ్జ గణపయ్య.. ఎక్కడంటే

|
Google Oneindia TeluguNews

వినాయక చవితి పండగ శోభ వచ్చేసింది. ఊరు, వాడ అంతా గణేశుడి విగ్రహాం, మండపం ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. చవితి సందర్భంగా వెరైటీగా వినాయక విగ్రహాలు రూపొందించడం పరిపాటి.. కొందరు అలా తమ సృజనను చాటుతారు. కొందరు పూలు, మరికొందరు పండ్లు, చాకొలెట్.. ఇలా విచిత్రంగా విగ్రహాలు రూపొందిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో బంగారంతో వినాయక ప్రతిమ రెడీ చేశారు.

స్పెషల్ ఎట్రాక్షన్

స్పెషల్ ఎట్రాక్షన్


చందౌసీలో నెలకొల్పే వినాయకుడి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆ విగ్రహాం స్వర్ణకాంతులీనుతూ భక్తులకు దర్శనం ఇవ్వనుంది. గోల్డెన్ గణపతి మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నాడు. తిరుపతి బాలాజీ స్టైల్‌లో 18 అడుగుల గోల్డెన్ గణేషుడి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. బంగారంతో వివిధ రకాల ఆకృతులను తాపడంగా చేస్తున్నారు. తిరుమల శ్రీవారి తరహాలో బంగారు ఆభరణాలను అలంకరిస్తున్నారు. బంగారు గణపయ్య విగ్రహం తయారీ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని.. చవితి రోజు నాటికి ప్రతిమ పూర్తవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.

18 అడుగులు

18 అడుగులు


18 అడుగుల గోల్డెన్‌ వినాయకుడి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబైలో అత్యంత సంపన్న గణేష్‌ మండపాన్ని సరస్వత్‌ బ్రాహ్మిణ్‌ సేవా మండల్‌ ఏర్పాటు చేస్తోంది. ముంబై కింగ్ సర్కిల్ ఏరియాలో ఏర్పాటు చేస్తోన్న మండపానికి ఏకంగా 316.40 కోట్లకు బీమా చేశారు. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ గణేషుడి మండపానికి, విగ్రహానికి, జువెలరీకి, వాలంటీర్లకు, వర్కర్లకు, పండ్లు, కూరగాయలు, గ్రాసరీ, ఫర్నీచర్‌కు వర్తించనుంది.

 స్వర్ణభరణాలు

స్వర్ణభరణాలు


గణేశ్ విగ్రహాన్ని స్వర్ణాభరణాలు, ఇతర విలువైన ఆభరణాలతో సుందరంగా అలంకరిస్తారు. మహా గణపతిని ఈసారి 66 కేజీలకు పైగా బంగారపు ఆభరణాలు, 295 కేజీల వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో అలంకరిస్తున్నట్టు జీఎస్‌బీ సేవా మండల్ తెలిపింది.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్

అయితే రంగుల వినాయకుడితో పర్యావరణానికి కీడు జరగనుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వల్ల నష్టమే... ఆ రంగుల వల్ల తేలికగా నీటిలో కరగవు.. ఒకవేళ కరిగినా... వాతావరణాన్ని కలుషితం చేస్తుంటాయి. అందుకే మట్టి గణనాథులను కొలుద్దాం అని పర్యావరణ వేత్తలు కోరుతుంటారు. దీంతో కొందరు అలా తయారు చేస్తున్నారు. యూపీలో అయితే బంగారు విగ్రహాన్ని నెలకొల్పారు.

English summary
18 feet golden ganesh idol to established in uttar pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X