మహారాష్ట్రలో ఘోర ప్రమాదం: డీసీఎం బోల్తా, 18మంది మృతి

Subscribe to Oneindia Telugu

పుణే: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బస్సు లోయలో పడి 27మంది విద్యార్థులు మృతి చెందిన ఘటన మరవకముందే.. మహారాష్ట్రలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

హిమాచల్‌లో ఘోర ప్రమాదం: లోయలోపడిన బస్సు, 27 మంది విద్యార్థులు మృతి

మహారాష్ట్రలోని ఖండాల దగ్గర డీసీఎం బోల్తా కొట్టడంతో.. 18మంది కార్మికులు మృతి చెందారు. మరో 14మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పుణే-సతారా హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిద్ర మత్తులో ఉన్న డీసీఎం డ్రైవర్ రెయిలింగ్‌ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

18 killed, 14 injured after truck hits barricade on Pune-Satara highway

మృతుల్లో ఎక్కువమంది భవన నిర్మాణ కార్మికులే ఉన్నట్టు సమాచారం. వీరంతా కర్ణాటక నుంచి పని నిమిత్తం పుణే వైపు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడినవారిని ఖండాలా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

స్థానిక పోలీస్ అధికారి ఒకరు ఘటనపై స్పందించారు. మూల మలుపు వద్ద కాస్త వాలుగా ఉందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బారికేడ్ ను ఢీకొట్టి ఉంటుందని తెలిపారు. రెయిలింగ్‌ను ఢీకొట్టిన తర్వాత.. డీసీఎం అక్కడినుంచి 10 అడుగుల దూరంలో పడిపోయినట్టు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least 18 people were killed and 14 others injured after their truck hit a barricade on Pune-Satara highway in Maharashtra early Tuesday morning, the police said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X