
రాజ్యసభలో గందరగోళం: టీఆర్ఎస్ సహా 19 మంది విపక్షాల ఎంపీలు సస్పెండ్
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల సభ్యులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. మరోవైపు, ఆందోళన చేస్తున్న సభ్యుల సస్పెన్షన్లు కూడా జరుగుతున్నాయి. సోమవారం లోక్‌సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయగా.. తాజాగా, మంగళవారం సభకు అంతరాయం కలిగించినందుకు రాజ్యసభ నుంచి 19 మంది ప్రతిపక్ష సభ్యులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.
ఆందోళనలు, నిరసనలు చేయవద్దని ఎంత కోరినా వినకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 7 మంది, డీఎంకేకు చెందిన 6 మంది, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి చెందిన ముగ్గురు, సీపీఐ (ఎం) నుంచి ఇద్దరు, సీపీఐకి చెందిన ఒకరు ఉన్నారు.

సస్పెండ్ చేయబడిన ఎంపీల వివరాలు:
టీఎంసీ
నుంచి
సుస్మితా
దేవ్
టీఎంసీ
నుంచి
మౌసమ్
నూర్
టీఎంసీ
నుంచి
శాంతా
ఛెత్రి
టీఎంసీ
నుంచి
డోలా
సేన్
టీఎంసీ
నుంచి
శాంతాను
సేన్
టీఎంసీ
నుంచి
అభి
రంజన్
బిస్వార్
టీఎంసీ
నుంచి
ఎండీ
నడిముల్
హక్
డీఎంకే
నుంచి
ఎం
హమద్
అబ్దుల్లా
డీఎంకే
నుంచి
ఎస్.కళ్యాణసుందరం
డీఎంకే
నుంచి
ఆర్.గిరంజన్
డీఎంకే
నుంచి
ఎన్.ఆర్.
ఎలాంగో
డీఎంకే
నుంచి
ఎం.
షణ్ముగం
డీఎంకే
నుంచి
కనిమొళి
ఎన్వీఎన్
సోము
టీఆర్‌ఎస్
నుంచి
బీ
లింగయ్య
యాదవ్
టీఆర్ఎస్
నుంచి
దామోదర్
రావు
దివకొండ
టీఆర్‌ఎస్
నుంచి
రవీంద్ర
వద్దిరాజు
సీపీఐ(ఎం)
నుంచి
వి.శివదాసన్
సీపీఐ(ఎం)
నుంచి
ఎ.ఎ.రహీం
సీపీఐ నుంచి సంతోష్ కుమార్ పి.