శవమైన తేలిన జర్మన్ యువతి, ఆత్మహత్యనా?

19-year-old German girl living in Delhi found dead
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో నివాసముంటున్న జర్మనీకి చెందిన యువతి(19) బుధవారం అదృశ్యమైంది. అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆ యువతి మృతదేహాన్ని ఫరీదాబాద్ సరిహద్దులోని రైల్యే ట్రాక్‌పై శుక్రవారం పోలీసులు గుర్తించారు. యువతి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

మృతురాలు జూడిత్ అయినో ఎహ్నాస్ దక్షిణ ఢిల్లీలోని సిఆర్ పార్క్ ప్రాంతంలో హెచ్‌బ్లాక్‌లో నివాసం ఉంటోంది. కల్కాజీలోని ఓ ఎన్జివో సంస్థలో ఆమె విధులు నిర్వహిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఎన్జీవో సంస్థతో కలిసి పనిచేసేందుకు ఎహ్నాస్ భారతదేశానికి వచ్చారు. ఆమె తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి ఢిల్లీలో ఉంటోంది.

బుధవారం రోజున తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి ఎహ్నాస్ బయటికి వెళ్లింది. అయితే ఇద్దరు సహోద్యోగులు తిరిగి ఇంటికి చేరుకున్నా ఎహ్నాస్ రాకపోవడంతో ఆమెకు ఫోన్ చేశారు. ఎహ్నాస్ సెల్‌ఫోన్స్విఛాఫ్‌లో ఉండడంతో ఆమె కోసం అన్ని ప్రాంతాల్లో వెదికారు. ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎహ్నాస్ సెల్‌ఫోన్‌ను ట్రెస్ చేసిన పోలీసులు ఆమె ఫరీదాబాద్‌లో ఉన్నట్లు గ్రహించిన అక్కడికి వెళ్లారు. ఫరీదాబాద్ రైల్వే ట్రాక్‌పై ఉన్న మృతదేహం ఎహ్నాస్దిగా గుర్తించారు. ఎన్జివో సంస్థతో కలిసి పనిచేసేందుకు భారతదేశానికి వచ్చిన ఎహ్నాస్, దేశంలోని పౌరులకు తమ హక్కులపై అవగాహన పెంపొందించే పలు కార్యక్రమాల్లో ఆమె వాలంటీర్‌గా పాల్గొంది. ఎహ్నాస్ ఆత్మహత్య చేసుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+