ఎన్నికలు: రూ.195 కోట్లు సీజ్, ఆంధ్రప్రదేశ్ టాప్

195 crore cash seized in poll season, Andhra Pradesh tops list
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ తనిఖీల్లో ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ (ఈసి) దేశవ్యాప్తంగా 195 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే 118 కోట్ల రూపాయలను ఎన్నికల వేళ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల కమిషన్ బృందాలు 26.56 లక్షల లీటర్ల మద్యాన్ని, 70 కిలోల హెరాయిన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాయి. నగదు పంపిణీ చేసినందుకు, ప్రలోభాలకు గురిచేసినందుకు 11,469 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.

ఎన్నికల్లో నల్లధనం వాడకాన్ని నిరోధించేందుకు, అక్రమ నిధులన పంపిణీని అరికట్టేందుకు ఎన్నికల కమిషన్ కేంద్ర రెవెన్యూ సర్వీసుల నుంచి 659 మంది అధికారులను తీసుకుంది. మార్చి 5వ తేదీన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి అధికారులు డబ్బులను, మద్యాన్ని స్వాధీనం చేసుకుంటూ వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 118 కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకోగా, తమిళనాడులో 18.31 కోట్ల రూపాయలు, మహారాష్ట్రలో 14.40 కోట్ల రూపాయలను, ఉత్తరప్రదేశ్‌లో 10.46 కోట్ల రూపాయలను, పంజాబ్‌లో నాలుగు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+