1988 రోడ్ రేజ్ కేసు: పాటియాలా కోర్టులో లొంగిపోయిన నవజోత్ సింగ్ సిద్ధూ
చండీగఢ్: 1988 నాటి కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నేత నవజోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం పాటియాల కోర్టులో లొంగిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం పాటియాలలోని తన నివాసం నుంచి జిల్లా కోర్టుకు వెళ్లిన ఆయన న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు.

కాగా, అంతకుముందు సిద్ధూ ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో లొంగిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే, ఆరోగ్య కారణాల రీత్యా తనకు కొన్ని వారాల సమయం ఇవ్వాలని సిద్ధూ న్యాయస్థానాన్ని కోరారు. సిద్ధూ తరపు న్యాయవాది ఏఎం సింఘీ ఈ పిటిషన్ ను జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ జేబీ పార్థివాలాలతో కూడిన ధర్మాసనం ముందుంచారు.
అయితే, ఈ కేసులో ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చినందున.. తాజా అభ్యర్థనపై తాము నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం తెలిసింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే శుక్రవారం సిద్ధూ పాటియాలా కోర్టులో లొంగిపోవడం గమనార్హం.
కాగా, 1988 డిసెంబర్ 27న నవజోత్ సింగ్ సిద్దూ, ఆయన స్నేహితుడైన రూపిందర్ సింగ్ సంధూ పాటియాలా రోడ్డు మధ్యలో జిప్సీ ఆపి ఉంచారు. ఆ మార్గంలో వచ్చిన గుర్నాంసింగ్(65) వాహనాన్ని పక్కకు తీయమని పదే పదే కోరారు. ఆవేశంతో మిత్రులు ఇద్దరూ వృద్ధుణ్ని కారు నుంచి బయటకు లాగి చితకబాదారు. ఆ తర్వాత గాయపడిన గుర్నాంసింగ్ ను ఆస్పత్రికి తరలించగా.. అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అయితే, సరైన సాక్ష్యాధారాలు లేవంటూ పాటియాలా జిల్లా సెషన్స్ కోర్టు ఈ కేసులోని నిందితులు సిద్ధూ, రూపిందర్ సింగ్ లను హద్య ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది. ఆ తర్వాత పంజాబ్, హర్యానా హైకోర్టుకు చేరిన ఈ కేసులో 2006 నాటి తీర్పు బాధితుడి పక్షాన వచ్చింది. సిద్ధూకు మూడేళ్ల శిక్ష విధించింది కోర్టు. ఈ తీర్పును 2018 మే 15న తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. ఓ సీనియర్ సిటిజన్‌ను గాయపరిచినందుకు సిద్ధూకు రూ. 1000 జరిమానా విధించింది. ఆ సమయంలో సిద్ధూ వెంట తను ఉన్నట్లు నమ్మదగ్గ సాక్ష్యాలు లేవంటూ రూపిందర్ సింగ్ సంధూను కేసు నుంచి విముక్తి చేసింది.
ఈ క్రమంలో అదే ఏడాది సెప్టెంబర్ నెలలో గుర్నాంసింగ్ కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పరిశీలనకు అంగీకరించిన సుప్రీంకోర్టు.. సిద్ధూకు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. ఈ జైలు శిక్షపై సిద్ధూ గురువారం స్పందిస్తూ తాను కోర్టు తీర్పును గౌరవిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సిద్ధూ కోర్టులో లొంగిపోయారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications