రోప్ వే ప్రమాదం: ఒకటికొకటి ఢీకొనడంతో ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు, 50 మంది కోసం రెస్క్కూ
రాంచీ: జార్ఖండ్‌లోని దేవఘర్ జిల్లాలో బాబా బైద్యనాథ్ ఆలయానికి సమీపంలోని త్రికుట్ హిల్స్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోప్‌వేపై కొన్ని కేబుల్ కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మరణించగా, 8 మంది గాయపడ్డారు. మరికొంత మంది పర్యాటకులు ప్రమాదం అంచున చిక్కుకుపోయారు. దీంతో వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, వాయుసేన రంగంలోకి దిగింది.
బైద్యనాథ్ ఆలయ సందర్శనకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు .. 20 కిలోమీటర్ల దూరంలోని త్రికూట పర్వతాల్లోని రోప్ వే వద్ద పర్యటిస్తుంటారు. అయితే, ఆదివారం రోప్ వే ద్వారా నడిచే కేబుల్ కార్లు ప్రమాదానికి గురయ్యారు. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు. కాగా, సుమారు 50 మంది 19 గంటలకుపైగా రోప్ వే క్యాబిన్లలో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.

చిక్కుకుపోయిన వారిని బయటికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలతోపాటు వాయుసేన కూడా రంగంలోకి దిగింది. రెండు మిగ్-17 హెలికాప్టర్లు కూడా రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయని వైమానిక దళం తెలిపింది.
Rescue Operation underway
— NDRF 🇮🇳 (@NDRFHQ) April 11, 2022
🔶@ Ropeway in Trikut, Devghar (JH)
🔶Multi agency coordination
🔶Rescues 18 person from 3 trollies
🔶Ops Continues #आपदा_सेवा_सदैव_सर्वत्र 🇮🇳@HMOIndia @BhallaAjay26@RanchiPIB @PIBHomeAffairs @NdrfP pic.twitter.com/BGONRZZXef
ఇప్పటికే కొందరు పర్యాటకులను సురక్షితంగా తరలించామని, మిగిలినవారిని కూడా రక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. వదంతలు వ్యాప్తి చేయొద్దని పోలీసులు కోరారు. కాగా, ఈ త్రికూట్ రోప్ వే అనేది భారతదేశంలోనే ఎత్తైన వర్టికల్ రోప్ వే కావడం గమనార్హం. 766 మీటర్ల పొడవు ఉన్న ఈ రోప్ వేలో 25 క్యాబిన్లు ఉంటాయి. ప్రతి క్యాబిన్లో నలుగురు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఎంతో ఆహ్లాదకరంగా సాగిన వారి ప్రయాణం విషాదంగా మారడంతో ప్రయాణికులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.












Click it and Unblock the Notifications