అసోంలో కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం, ఇద్దరు మృతి
గౌహతి: భారత వైమానిక దళానికి చెందిన ఓ తేలికపాటి విమానం గురువారం అసోంలో కుప్పకూలిపోయింది. జోర్హత్ ప్రాంతంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు.
సాధారణ శిక్షణ నిమిత్తం వైమానిక దళానికి చెందిన ఇద్దరు పైలట్లు మధ్యాహ్నం జోర్హత్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరారు. టేకాఫ్ ఐన కాసేపటికి విమానం కూలింది.

ఘటనలో ఇద్దరు పైలట్లు అక్కడిక్కడే మృతిచెందారు. ఘటనకు గల కారణాలపై తెలియాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్లే విమానం కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications