Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేగం: బీఎండబ్ల్యు కారు 3 ముక్కలు, ఇద్దరు మృతి

లుథియానా: పంజాబ్ రాష్ట్రంలో రోడ్డు పైన అత్యంత వేగంతో ప్రయాణిస్తూ అదుపు తప్పిన బీఎండబ్ల్యూ కారు ముక్కలైంది. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, పరిమితికి మించిన వేగంతో యువకులు ప్రమాదాల బారినపడుతున్నారు. ఇప్పుడు బీఎండబ్ల్యూ కారే ముక్కలు కావడం గమనార్హం.

పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలోని సారభనగర్ రోడ్డుపై అత్యంత వేగంతో ప్రయాణిస్తూ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొన్న ఈ బీఎండబ్ల్యూ కారు మూడు ముక్కలైంది. ఈ సంఘటనలో 25-27 ఏళ్ల మధ్య వయస్కులు ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాండూరు డిపో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

2 killed as BMW hits tree and breaks into 3 pieces in Ludhiana

రంగారెడ్డి జిల్లాతాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు మహారాష్ట్రలోని పుణేలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. పుణే వద్ద ఆగి ఉన్న డీసీఎం వ్యాను ఆర్టీసీ బస్సు ఢీకొనగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

పెరల్స్‌ ఆఫీసుపై ఏజెంట్లు, ఖాతాదారుల దాడి

కర్నూలు జిల్లాలోని కొత్తబస్టాండ్‌ సమీపంలోని ఓ కాంప్లెక్స్‌లో ఉన్న పెరల్స్‌ కార్యాలయంపై ఏజెంట్లు, ఖాతాదారులు దాడి చేశారు. గడువు ముగిసినా సొమ్ము చెల్లించలేదని వారు ఆందోళనకు దిగారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

చిత్తూరులో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రామకుప్పం మండలం కొల్లపల్లి దగ్గర పంటపొలాలను ఽధ్వంసం చేశాయి. టామోటా, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బాలయ్యగుంటలో సంచరిస్తున్న 37 ఏనుగులను అటవీ సిబ్బంది తమిళనాడు వైపు దారి మళ్లిస్తున్నారు.

చెత్తకుప్పలో పసికందు లభ్యం

హైదరాబాద్‌ నగరంలోని బోడుప్పల్‌లో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో వదిలేసి వెళ్లారు. పాపను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని వెంటనే పాపను నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. పాప తల్లి కోసం పోలీసులు విచారణ చేపట్టారు. చుట్టప్రక్కల ఉన్న ఆస్పత్రులతో పాటు, సీసీ కెమెరాల ద్వారా పాపను పడేసిన వారి కోసం పోలీసులు దర్యాప్తు నిర్వహించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+