అక్కాచెల్లెళ్లను గ్యాంగ్ రేప్ చేసి చెట్టుకు ఉరేశారు

ఈ ఇద్దరు కజిన్స్ కూడా గత రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. ఉదయంపూట వారిద్దరి శవాలు గ్రామంలోని మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఈ బాలికల వయస్సు 14, 15 ఏళ్ల మధ్య ఉంటుంది. సంఘటనకు విస్తుపోయిన గ్రామస్తులు సంఘటనా స్థలంలో గుమిగూడారు.
ఓ పోలీసు కానిస్టేబుల్, మరో నలుగురు ఈ సంఘటనకు బాధ్యులని గ్రామస్తులు ఆరోపించారు. నిందితులతో పాటు ఓ పోలీసు కానిస్టేబుల్ కూడా పారిపోయినట్లు పోలీసు సూపరింటిండెంట్ మాన్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఆ కానిస్టేబుల్‌ను సర్వేష్ యాదవ్‌గా గుర్తించారు.
సామూహిక అత్యాచారం జరిగిందనే విషయాన్ని కొట్టి పారేయలేమని, అయితే దాన్ని వైద్య పరీక్షల్లో నిర్ధారించుకోవాల్సి ఉందని చౌహాన్ చెప్పారు. గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఉషైత్ పోలీసు స్టేషన్‌లోని పోలీసులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకోవడానికి వెనకాడారని వారు ఆరోపించారు.












Click it and Unblock the Notifications