యాగం కోసం 2 ఏళ్ళ బాలుడి నరబలి

Posted By:
Subscribe to Oneindia Telugu

వేలూరు: తమిళనాడులోని వేలూరు జిల్లా వానియంబాడిలోని స్వామిజీ మఠంలో చిన్నారి మృతిచెందారు.నరబలి ఇచ్చి నీటి తొట్టెలో వేశారంటూ స్థానికులు మఠాన్ని ధ్వంసం చేశారు.

ప్రపంచం కొత్త కొత్త టెక్నాలజీతో రోజు రోజుకు అభివృద్ది చెందుతోంది. కానీ, సమాజంలో మాత్రం మూఢనమ్మకాలు పోవడం లేదు.

black magic

మేల్ నిమ్మయంబట్టు గ్రామ సమీపంలో రవి అనే వ్యక్తి మఠం ఏర్పాటుచేసి పదేళ్ళుగా అక్కడే ఉంటున్నాడు. ఏడడుగుల నీటి తొట్టెను ఏర్పాటుచేసి అందులో తాబేళ్ళను పెంచుతున్నాడు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగం చేస్తుంటారు.

మఠానికి సమీపంలోనే మురుగన్ కుటుంబంతో ఉంటున్నాడు. మంగళవారం నాడు హరికేష్ అలియాస్ తులసి కన్పించకుండాపోయాడు. విషయం తెలుసుకొన్న కుటుంబీకులు మఠంలో వెదికగా నీటి తొట్టెలో శవమై కన్పించాడు.

సోమవారం రోజున పౌర్ణమి .చంద్రగ్రహణం కావడంతో స్వామిజీ రవి ప్రత్యేక యాగం చేశారని, ఆ సమయంలో బాలుడిని ఇచ్చి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. కోపంతో గ్రామస్థులు మఠంలోని స్వామిజీపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.

మఠంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. గాయపడిన రవి అక్కడి నుండి తప్పించుకొని పరారయ్యాడు. బాలుడిని బలి ఇచ్చారంటూ రవి వానియంబాడి పోలీసులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
2 years old child sacrifice in vaniyambadi . villagers complaint against ravi, police interrogated him on this incident.
Please Wait while comments are loading...