తిరంగ పండగకు సర్వం సిద్ధం: దేశ రాజధానిలో.. !!

యావత్ దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతోంది. నయా భారత్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకొంటున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంకాస్సేపట్లో దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మిలటరీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అధికారులు.. ఈ కార్యక్రమాలకు హాజరు కానున్నారు.

20 000 Police deploys and AI surveillance in Delhi

అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మువ్వన్నెల జెండా ఎగురవేస్తారు. చారిత్రాత్మక గోల్కొండ కోటపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.

స్వాత్రంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మువ్వన్నెల విద్యుద్దీపాలతో అలంకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చారిత్రాత్మక కట్టడాలు.. త్రివర్ణాలతో మెరిసిపోతున్నాయి. తెలంగాణ సచివాలయం, చార్మినార్, వరంగల్‌లోని వేయి కాళ్ల మండపం, ఏపీలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, కర్నూలు కొండారెడ్డి బురుజు.. ఇలా అనేక కట్టడాలు కొత్త కళను సంతరించుకున్నాయి.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రాష్ట్రాల్లో భద్రత పెంచారు. ఢిల్లీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు డ్రోన్లతో నిఘా ఉంచారు. వాహనాలను తనఖీ చేశారు. ఎర్రకోట సమీపంలో వాహనాలను దారి మళ్లించారు.

ఢిల్లీ సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నొయిడా, ఘజియాబాద్, గుర్‌గావ్ మీదుగా ఢిల్లీలోకి ప్రవేశించే ప్రాంతాల్లో చెక్ పాయింట్లను నెలకొల్పారు. జవహర్ లాల్ నెహ్రూ మార్గ్, బహదూర్ షా జఫర్ మార్గ్, రింగ్ రోడ్‌లో వాహనాల రాకపోకలను నియంత్రించారు.

ఎర్రకోట వద్ద అధునాతన భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఫేసియల్ రికగ్నిషన్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR), యాంటీ-ఇంట్రూషన్ కెమెరాలు, పీపుల్ కౌంట్ కెమెరాలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో భద్రతను పర్యవేక్షిస్తోన్నారు. 20 వేల మంది అదనపు పోలీసులను మోహరింపజేశారు.

అనుమానాస్పద వాహనాలను గుర్తించడానికి ANPRను వినియోగిస్తోన్నారు. ఇది నంబర్ ప్లేట్లను స్కాన్ చేస్తుంది. ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థలో మూడు లక్షల మంది అనుమానితుల డేటాబేస్ ఉంటుంది. యాంటీ-ఇంట్రూషన్ కెమెరాలు కోటలోని ప్రతి గోడను, కంచెను పర్యవేక్షిస్తాయి.

అనుమానాస్పద కదలికలు లేదా ఎర్రకోట ఆవరణలోనికి అక్రమంగా ప్రవేశించడానికి ఎవరు ప్రయత్నించినా అధికారులను అప్రమత్తం చేస్తాయి ఈ కెమెరాలు. యాంటీ డ్రోన్ టెక్నాలజీని సైతం ఢిల్లీ భద్రత కోసం వినియోగిస్తోన్నారు. 800కి పైగా సీసీటీవీ కెమెరాలు కీలక ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+