హిమాచల్‌లో ఘోర ప్రమాదం: లోయలోపడిన బస్సు, 27 మంది విద్యార్థులు మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడటంతో 27 మంది విద్యార్థులు మృతి చెందారు. వజీర్ రామ్ సింగ్ పఠానియా స్కూల్‌కు చెందిన బస్సు ఇది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు లోయలో పడినట్లుగా తెలుస్తోంది. వంద అడుగుల లోతున బస్సు పడింది. చనిపోయిన వారంతా ఐదో తరగతి లోపు విద్యార్థులే.

సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత ఆ బస్సు విద్యార్థులను ఇంటికి తరలిస్తోంది. ఈ సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ బస్సు 42 సీట్లు కలిగి ఉంది. ఆ బస్సులో ఎందరు విద్యార్థులు ఉన్నారో తెలియాల్సి ఉంది.

స్థానికుల సహకారంతో బస్సు నుంచి ఇరవై మృతదేహాలను తీసినట్లు నుర్పూర్ ఎస్డీఎం హుస్సేన్ సాయంత్రం తెలిపారు. పలువురు గాయపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A school bus owned by a private school Wazir Ram Singh Pathania fell into a deep gorge on Monday while it was on way to drop students back to their homes. Bus was not visible from the road, authorities confirmed that the bus was 42-seater but number of students on board was not confirmed as rescue operation was on.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి