Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

త్రిపుర గెలుపులో ఆ 20 ఎస్టీ సీట్లే కీలకం: రబ్బర్ ప్లాంటేషన్ కూడా!!

న్యూఢిల్లీ: త్రిపుర రాష్ట్ర అసెంబ్లీకి ఆదివారం జరుగనున్న ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 1993 నుంచి ఇప్పటి వరకు, 25 ఏళ్ల పాటు త్రిపుర రాష్ట్రాన్ని పాలిస్తున్న సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్‌కు గెలుపు సాధ్యమైనా? ప్రభుత్వ వ్యతిరేక ఓటును అనుకూలంగా మలుచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న బీజేపీ విజయం సాధిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొండ ప్రాంతాల్లోని గిరిజనులకు రిజర్వు చేసిన 20 స్థానాలే ఎవరు అధికారానికి దగ్గరవుతారన్న సంగతిని నిర్దేశిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆదివారం 59 స్థానాలకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం చివరి దశలో ప్రధాని నరేంద్రమోదీ గిరిజనుల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా శాంతిర్ బజార్ సభలో పాల్గొన్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 20 గిరిజన స్థానాలను సీపీఎం గెలుచుకున్నది.

గత ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన ఇండిజినియస్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ త్రిపుర (ఐఎన్పీటీ) అనే గిరిజన పార్టీ ఈ దఫా బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నది. అదే ఎన్నికల్లో బీజేపీ కేవలం 1.87 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది. కానీ 2014 నుంచి బీజేపీ సంస్థాగత పునాది నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. ఆరెస్సెస్, అనుబంధ సంస్థలు విస్తరణపై కేంద్రీకరించాయి. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్యా రంగ వసతుల కల్పనపై ప్రచారోద్యమం చేపట్టాయి. 2015లో జరిగిన జిల్లా కౌన్సిళ్ల మండల ఎన్నికల నుంచి సీపీఎంకు బీజేపీకి పలు స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వనున్నది. గమ్మత్తేమిటంటే రాష్ట్రమంతటా విస్త్రుత ప్రచారం చేసినా.. ఎక్కువ శాతం సీఎం మాణిక్ సర్కార్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ధన్‌పూర్ అసెంబ్లీ స్థానంపైనే ప్రధానంగా కేంద్రీకరించడం గమనార్హం.

మెరుగున్న మాణిక్ సర్కార్

మెరుగున్న మాణిక్ సర్కార్

లెఫ్ట్ ఫ్రంట్‌కు ఓటేసిన త్రిపుర ప్రజలు బీజేపీని గెలిపిస్తారా?
త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ మాత్రం తమ రాష్ట్రంలో గిరిజనులు, దళితుల పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో కంటే మెరుగ్గా ఉందని వాదిస్తారు. వీరే రాష్ట్రానికి వెన్నెముక అని అంటారు. దశరథ దేవ్ వర్మ వంటి సీఎంలు గిరిజన సామాజిక వర్గం నుంచే వచ్చారు. త్రిపుర ప్రజల ఐక్యత పలువురు నేతలు ఉన్నత శిఖరాలకు ఎగిసిందుకు దోహద పడిందని, వారి ఐక్యతను దెబ్బ తీయడం అంత తేలిక్కాదని పలువురు చెబుతుంటారు. అయితే లెఫ్ట్‌ఫ్రంట్‌లో సీపీఎంతోపాటు సీపీఐ, రెవల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ, అఖిల భారత ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలు ఉన్నాయి. సైద్ధాంతికంగా వామపక్షాలు, బీజేపీ పరస్పరం విరుద్ధమని, ఇరుపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని తెల్సిందే. అలాంటప్పుడు ఇంతకాలం వామపక్షాలను గెలిపిస్తూ వచ్చిన త్రిపుర ప్రజలు బీజేపీకికి ఓటు వేస్తారా? అన్న ప్రశ్న రాజకీయ విశ్లేషకులను తొలుస్తోంది.

ఇలా లెఫ్ట్ కార్యకర్తల బెదిరింపులతో ప్రజల్లో వ్యతిరేకత

ఇలా లెఫ్ట్ కార్యకర్తల బెదిరింపులతో ప్రజల్లో వ్యతిరేకత

కేంద్రంలో కూడా బీజేపీయే అధికారంలో ఉండడంతో రాష్ట్రంలో కూడా అదే పార్టీకి ఓటు వేయడం వల్ల రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్న నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ అంత బలంగా కనిపించడం లేదు. మొత్తానికి త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష వామపక్షానికి, బీజేపీకి మధ్యే రసవత్తరమైన పోటీ జరుగనుంది. వామపక్షాలు పాతికేళ్లపాటు అధికారంలో కొనసాగడానికి కారణం రాష్ట్రంలో రబ్బర్‌ ప్లాంటేషన్‌ను ఎక్కువగా ప్రోత్సహించడం, రైతులకు తగిన గిట్టుబాటు ధర రావడం కారణం. ఇప్పుడు వ్యతిరేకత పెరగడానికి అంతర్జాతీయంగా రబ్బర్‌ ధరలు దారుణంగా పడిపోవడం, పార్టీ కార్యకర్తలకే రబ్బర్‌ తోటల పెంపకానికి రాయితీలు ప్రకటించడం, వారికే సహకరించడం. అంతర్జాతీయంగా కొన్నేళ్లుగా చమురు ధరలు పడిపోవడంతో ఆ చమురు ఉపయోగించి కృత్రిమ రబ్బరును తయారు చేయడం ఎక్కువవడంతో పోటీ తట్టుకోవడం కోసం అసలు రబ్బరు రేట్లు భారీగా తగ్గాయి. రబ్బరు తోటల్లో ఎర్ర జెండాలు తప్ప మరో జెండా కనిపించడానికి వీల్లేదంటూ వామపక్ష నాయకులు రైతులను బెదిరించడం కూడా వారిలో వారిపట్ల వ్యతిరేకతకు దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

కేంద్రం అటవీ భూములపై ఆంక్షలతో వ్యతిరేక ఉద్యమం

కేంద్రం అటవీ భూములపై ఆంక్షలతో వ్యతిరేక ఉద్యమం

1960 దశకంలో త్రిపుర ప్రజలు ఎక్కువగా పోడు వ్యవసాయంపై ఆధారపడి బతికేవారు. చెట్లను కొట్టేసి, వాటిని తగులబెట్టి, నెలను చదును చేసి రైతులు వ్యవసాయం చేసేవారు. అయినా వారికి నెలవారీగా రెండు, మూడు వేల రూపాయలకు మించి వచ్చేవి కావు. ఆ తర్వాత చెట్లను రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం అటవి భూములపై ఆంక్షలు తేవడంతో రాష్ట్రంలో తిరుగుబాటు ఉద్యమం మొదలైంది. చివరకు అది ప్రత్యేక రాష్ట్రం అవతరణకు దారితీసింది. ఆ తర్వాత కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ రైతులతో పోడు వ్యవసాయాన్ని మాన్పించేందుకు రబ్బర్‌ ప్లాంటేషన్‌ను ప్రోత్సహించింది. అందులో భాగంగా రాష్ట్రస్థాయిలో, కేంద్ర స్థాయిలో రబ్బర్‌ ప్లాంటేషన్‌ బోర్డులను ఏర్పాటు చేసింది.

మాణిక్ సర్కార్‌కు సవాలుగా మారిన నిరుద్యోగ సమస్య

మాణిక్ సర్కార్‌కు సవాలుగా మారిన నిరుద్యోగ సమస్య

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వామపక్ష ప్రభుత్వం కూడా రబ్బర్‌ ప్లాంటేషన్‌ను తీవ్రంగా ప్రోత్సహించింది. రైతులకు అన్ని విధాల సబ్సిడీలను కల్పించి ఆదుకుంది. దాంతో ఒక్కసారి ఒక్కో రైతు ఆదాయం నెలకు 20 నుంచి 30వేల రూపాయలకు పెరిగిపోయింది. రాష్ట్రంలో విద్యను కూడా బాగా ప్రోత్సహించింది. ఫలితంగా రాష్ట్రంలో అక్షరాస్యత శాతం దాదాపు 95 శాతం ఉంది. ఆదాయం పడిపోవడంతో రబ్బర్‌ రైతులు నిరాశతో ఉన్నారు. నిరుద్యోగం కూడా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ వామపక్షాలను ప్రజలు ఆదరిస్తారా? అన్నది అనుమానం. కాకపోతే రాష్ట్ర విభజనను కోరుతున్న ఇండిజియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ)తో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని సీపీఎం ప్రశ్నిస్తోంది. బీజేపీతో పొత్తు కోసం ఐపీఎప్టీ నాయకులు ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలవాల్సిన అవసరమేమిటని ప్రశ్నిస్తోంది. కానీ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్.. తమ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పరిశీలనకు వివిధ మంత్రిత్వశాఖల మధ్య అంతర్గత అధ్యయన కమిటీ వేస్తామని చెప్పారని దేవ్ వర్మ అనే గిరిజన నేత చెప్పారు. సీపీఎంపై ఆరోపణపై బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జీ హిమంత బిశ్వశర్మ స్పందిస్తూ బీజేపీ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక ప్రగతికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటుందని పేర్కొనడం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+