పట్టపగలు వాచ్ మన్ ఘాతుకం, రోడ్డు మీద వెళుతున్న అమ్మాయిని గదిలోకి లాక్కెళ్లి...
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహేప్‌సింగ్ పూరన్‌సింగ్ తోమర్(35) ఒంటరివాడు. సొంత రాష్ట్రంలో ఉపాధి దొరక్క పూణే నగరానికి వలస వచ్చి నాన్సీ టవర్స్ అపార్ట్ మెంట్ లో వాచ్ మన్ ఉద్యోగంలో చేరాడు. మంగళవారం
పూణే : పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వాచ్ మన్ రోడ్డుపై వెళుతున్న అమ్మాయిని అడ్డగించి, బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన దారుణ ఘటన పూణే నగరంలో సంచలనం సృష్టించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహేప్‌సింగ్ పూరన్‌సింగ్ తోమర్(35) ఒంటరివాడు. సొంత రాష్ట్రంలో ఉపాధి దొరక్క పూణే నగరానికి వలస వచ్చి నాన్సీ టవర్స్ అపార్ట్ మెంట్ లో వాచ్ మన్ ఉద్యోగంలో చేరాడు.

మంగళవారం మధ్నాహ్నం పట్టపగలు పన్నెండున్నర గంటల ప్రాంతంలో తమ అపార్ట్ మెంట్ ముందు రోడ్డుపై వెళుతున్న ఓ అమ్మాయి(20)ని వాచ్ మన్ మహేప్ సింగ్ అడ్డగించాడు.
ఆ అమ్మాయి ప్రతిఘటిస్తూ కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా బలవంతంగా తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయసాగాడు. సమీపంలోనే రోడ్డుపై ఉన్న జనం ఇది గమనించి కూడా ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారేకానీ అతడ్ని అడ్డుకుని ఆ అమ్మాయిని రక్షించలేదు.
ఈలోగా ఎవరో పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి వాచ్ మన్ మహేప్ సింగ్ పూరన్ సింగ్ తోమర్ ను అదుపులోకి తీసుకున్నారు. బెదిరిపోయిన ఆ అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే బాధిత యువతి మానసిక స్థితి కూడా సరిగా లేదని, తనకొక తమ్ముడు ఉన్నట్లు మాత్రమే చెబుతోంది తప్ప కనీసం తన చిరునామానుకానీ, తమ్ముడి చిరునామాని కానీ చెప్పలేకపోతోందని కేసు దర్యాప్తు చేస్తోన్న ఎస్సై వివి ఘాటే తెలిపారు.
నిందితుడైన వాచ్ మన్ తోమర్ ను తమ అదుపులో ఉంచుకుని ప్రశ్నిస్తున్నామని, అతడు చేసిన నేరం ఒప్పుకోవడంతో ఇప్పటికే అత్యాచారం కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications