కదులుతున్న కారులోనే మత్తుమందిచ్చి మహిళపై గ్యాంగ్ రేప్ .. కాంచీపురం ఘటనలో ఐదుగురు అరెస్ట్
మానవత్వం మంటగలిసి పోతుంది. రాక్షసత్వం రాజ్యమేలుతోంది. మహిళలపై అత్యాచార ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు మహిళా లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎక్కడ చూసినా కామాంధులు పెట్రేగి పోతున్నారు. మహిళల మానాలతో ఆడుకుంటున్నారు. పట్టపగలు నడిరోడ్డు మీద వారి ప్రాణాలను నిలువునా తీసుకున్నారు. గత రెండు మూడు రోజుల్లో జరిగిన ఘటనలు యావత్ దేశాన్ని షాక్ కు గురి చేస్తున్నాయి.
కాంచీపురంలో కారులో మహిళపై గ్యాంగ్ రేప్
నిన్నటికి నిన్న ముంబైలో ట్రక్కులో ఓ మహిళపై అత్యాచారం చేసి, ఆ మహిళ మర్మాంగంలో ఇనుప రాడ్ చొప్పించి చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో ఈరోజు ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇదిలా ఉంటే
తమిళనాడులోని కాంచీపురంలో బుధవారం కదులుతున్న కారులో 20 ఏళ్ల మహిళకు మత్తు మందిచ్చి ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత సామూహిక అత్యాచారం చేసి ఆమెను రోడ్డుపై పడేసిన ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

స్నేహం పేరుతో నమ్మించి మత్తు మందిచ్చి దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు బాధితురాలితో స్నేహం చేశాడని, మొబైల్ షాప్‌లో ఉద్యోగిగా పని చేసే ఆమెను తరచుగా కలుసుకునేవాడని, సోషల్ మీడియాలో ఆమెతో సంభాషించేవాడని పోలీసులు వెల్లడించారు. అతడు తన స్నేహితుడిని కూడా ఆమెకు పరిచయం చేసి బాధితురాలికి ఓ ప్రైవేటు కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నమ్మించాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 8 న, బాధితురాలిని ప్రధాన నిందితుడు కారులో ఎక్కించుకుని కాంచీపురంలోని ఫాంహౌస్‌కు తీసుకెళ్లాడు. ఫామ్‌హౌస్‌కు వెళ్లే మార్గంలో, నిందితుడు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ను బాధితురాలికిచ్చి తాగేలా చేశాడు.
మరో నలుగురు స్నేహితులను పిలిచి కారులోనే సామూహిక అత్యాచారం
అది తాగిన మహిళ స్పృహ కోల్పోయిన తర్వాత, ప్రధాన నిందితుడు మరో నలుగురు స్నేహితులను పిలిచి, కారు లోపల బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేశాడు. బాధితురాలు స్పృహలోకి రాగానే కారు అద్దాన్ని కాళ్లతో పగలగొట్టి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. సహాయం కోసం అర్ధించింది. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొంతమంది వ్యక్తులు కారు వైపు పరిగెత్తుకు రావడాన్ని చూసిన ఐదుగురు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయారు. నిందితులు బాధితురాలిని చెన్నై-బెంగళూరు హైవేపై పడేసి పారిపోయారు.
బాధితురాలిని రోడ్డుపై పడేసిన నిందితులు పరారీ .. ఐదుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు
కామాంధుల సామూహిక అత్యాచార ఘటనలో గాయపడిన బాధిత మహిళను కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా జిల్లా ఎస్పీ విచారణ జరిపి నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 9 న, పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేయగా, సెప్టెంబర్ 10 న మరొక నిందితుడిని అరెస్టు చేశారు. సామూహిక అత్యాచారం మరియు లైంగిక వేధింపులతో సహా ఇండియన్ పీనల్ కోడ్ లోని ఏడు సెక్షన్ల కింద పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా సరే మానవ మృగాలు నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపైఅత్యాచారాలకు పాల్పడుతూనే ఉన్నారు. సభ్య సమాజంలో ఇలాంటి పోకడలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మహిళలపై నిత్య కృత్యంగా మారుతున్న దాడులు మన ప్రభుత్వాల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. మన చట్టాలను నిరర్ధకంగా చేస్తున్నాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications