కొండచరియలు పడి 25మంది మృతి, శిథిలాల కింద..

శిథిలాలకింద అనేకమంది చిక్కుకున్నట్లు తెలియవచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మహారాష్ట్రలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. బుధవారం పుణె సమీపంలోని అంబెగాన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వర్షాలు పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
పోలీసు అధికారులు మాట్లాడుతూ.. అంబేగాన్ తెహిసిల్‌లోని మాలిన్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందన్నారు. కొండ చరియలు విరగడంతో పెద్దపెద్ద రాళ్లు కిందకు పడ్డాయన్నారు.












Click it and Unblock the Notifications