వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాస్ లీకేజీ: 200మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రులకు తరలింపు

ఢిల్లీలోని ఓ స్కూల్‌ సమీపంలో గ్యాస్‌ లీక్‌ అవడంతో పాఠశాలలోని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ స్కూల్‌ సమీపంలో గ్యాస్‌ లీక్‌ అవడంతో పాఠశాలలోని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం తుగ్లకాబాద్‌లోని రాణి ఝాన్సీ సర్వోదయ కన్య విద్యాలయ సమీపంలోని ఓ కంటేనర్‌ డిపోలో ప్రమాదవశాత్తు గ్యాస్‌ లీకైంది.

గ్యాస్‌ దట్టంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు అంబులెన్స్‌లతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన 200 మందికి పైగా విద్యార్థులకు దగ్గర్లోని నాలుగు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

gas leak

మిగతా విద్యార్థులకు సురక్షితంగా ఇళ్లకు పంపించి పాఠశాలకు సెలవు ప్రకటించారు.
అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ జైజల్‌, బీజేపీ నేతలు పరామర్శించారు. ప్రస్తుతం విద్యార్థులంతా ప్రమాదం నుంచి తప్పించుకున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

English summary
Nearly 200 school students were hospitalised on Saturday after they complained of irritation in eyes due to gas leakage from a container depot near their school in southeast Delhi's Tughlakabad area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X