నన్ గ్యాంగ్‌రేప్ కేసు: ముగ్గుర్ని దోషులుగా తేల్చిన కోర్టు

ఈ కేసు విషయంలో 2010 ఆగస్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి వాదనలు విన్న కోర్టు, మార్చి 14 శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. కాగా కేసు సంబంధించిన విచారణలో ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అత్యాచార ఘటన అనంతరం ఢిల్లీలో ఉన్న బాధితురాలి దగ్గర్నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు ఒరిస్సా రాష్ట్రం నుంచి క్రైం బ్రాంచి పోలీసులు ఇక్కడికి వచ్చారు. బాధితురాలు ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపింది. అల్లర్ల సమయంలోనే తనపై కొందరు అత్యాచారానికి పాల్పడి, అర్థనగ్నంగా వీధుల్లో తిప్పారని బాధితురాలు ఆరోపించింది.
ఆమె దగ్గర్నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత పోలీసులు కేసు దర్యాప్తు జరిపారు. విచారణ చేపట్టిన పోలీసులు ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, 2008లో జరిగిన కాంధమాల్ అల్లర్లో 38 మంది ప్రజలు హత్యకు గురయ్యారు. ట్రైబల్స్ ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ నాయకుడు లక్ష్మానంద సరస్వతీ హత్యకు గురైన తర్వాత ఈ అల్లర్లు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications