నాడు బార్ లో సప్లేర్...... నేడు ఐఏఎస్ అధికారి
బెంగళూరు: కుణిగల్ తాలుకా హులియూరుదుర్గ సమీపంలోని దోడ్డ కోప్పలు గ్రామంలో నివాసం ఉంటున్న కరియప్ప, గౌరమ్మ దంపతులకు 1979లో డి. కే. రవి జన్మించాడు. పేద రైతు కుటుంబంలో జన్మించిన రవి 7వ తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. తరువాత సిద్దార్థ సంస్థలో 10వ తరగతి వరకు చదువుకున్నారు.
కరియప్ప, గౌరమ్మ దంపతులు చుట్టు పక్కల గ్రామాలలో నూనె విక్రయించి రవిని చదివించారు. రవిని బాగా చదవాలని ఆయన అన్న రమేష్, అక్క భారతి ప్రోత్సహించారు. ప్రతి రోజు రవి ఇంటిలో సంగటి చేసే వారు. శనివారం మద్యాహ్నం, ఆదివారం మాత్రం అన్నం చేసే వారు.
ఉన్నత విద్యాభ్యాసం కోసం కుటుంబ సభ్యుల మీద భారం వెయ్యరాదని రవి బావించాడు. రాత్రిపూట బార్లు, వైన్ షాప్ లలో సప్లేర్ గా పని చేశారు. ఆవిదంగా ఉన్నత విద్యకు కావలసిన నగదు సమకూర్చుకున్నాడు. 2005లో కేఏఎస్ పరిక్షలు వ్రాశారు. అయితే ఇంటర్వూలో ఆయన ఫెయిల్ కావడంతో ఉద్యోగం రాలేదు. 2005లో కేఏఎస్ పరిక్షలు వ్రాసి ఎక్సైజ్ శాఖలో సబ్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగం సంపాదించారు.

సివిల్స్ పరిక్షలు వ్రాయడానికి రెండు నెలలు సెలవు కావాలని పై అధికారులకు మనవి చేశారు. నీకు రెండు నెలలు సెలవు ఇవ్వడం కుదరదు, కావాలంటే ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి అని అధికారులు తేల్చి చెప్పారు. సివిల్స్ కు ఎస్ఐ ఉద్యోగం అడ్డుగా ఉందని 2007లో రాజీనామ చేశారు.
తరువాత సివిల్స్ పరిక్షలు వ్రాసినా ఉత్తిర్ణత కాలేదు. రెండవ సారి సివిల్స్ పరిక్షలు వ్రాశారు. ఆ సమయంలో రవికి 102 డిగ్రీల జ్వరం ఉంది. కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా రవి పట్టించుకొకుండ పరిక్షలు వ్రాశారు. తరువాత 36వ ర్యాంకు సాదించి ఐఏఎస్ అధికారి అయ్యారు. గుల్బర్గాలో అసిస్టెంట్ కమిషనర్ గా, కోప్పళలో జిల్లా పంచాయితీ ముఖ్య కార్యదర్శిగా, కోలారు జిల్లా కలెక్టర్ గా (14 నెలలు) ఉద్యోగం చేశారు.
నాలుగు నెలల క్రితం కోలారు నుండి వాణిజ్య పన్నలు విభాగానికి రవిని బదిలి చేశారు. ఆ సమయంలో కోలారు జిల్లా మొత్తం స్వచ్చందగా బంద్ నిర్వహించారు. నేడు రవి కలెక్టర్ స్థాయికి వచ్చినా ఆయన తన గతాన్ని మరిచిపోలేదని ఆయన స్నేహితులు, గ్రామస్తులు అంటున్నారు.












Click it and Unblock the Notifications