రాక్షసి అంటేనే జయలలిత: అన్నీ కావాలంట
బెంగళూరు: రాక్షసి అంటే జయలలిత, ఆమెకు అన్నీ కావాలి అంటారని వాటళ్ పార్టీ అధ్యక్షడు, మాజీ శాసన సభ్యుడు వాటళ్ నాగరాజ్ మండిపడ్డారు. ఈనెల 9వ తేది శుక్రవారం కర్ణాటక బంద్ ను విజయవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జయలలిత అంత మూర్ఖురాలు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ లేరని వాటళ్ నాగరాజ్ అన్నారు. కావేరీ నీటి కోసం తాము ప్రాణాలు త్యాగం చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. కన్నడిగులు కావేరీ నీటి కోసం పోరాటం చేస్తారని అన్నారు.
జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కావేరీ నీటి వివాదాన్ని తెరమీదకు తీసుకువస్తారని మండిపడ్డారు. 1991లో కావేరీ నీరు తమిళనాడుకు వదలకూడదని తాము పోరాటం చేశామని వాటళ్ నాగరాజ్ గుర్తు చేశారు.

అయితే జయలలిత ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కావేరీ నీటి విషయంలో రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వం అంటే ప్రతిఘటనలు చేయ్యడమే అని వాటళ్ నాగరాజ్ చెప్పారు.
తాము కావేరీ నీటి విషయంలో ఆందోళనలు చేసి ఏమిసాధిస్తామో అనేది వేరే విషయం. మాకు అన్యాయం జరిగిందని అందరికి చెప్పడానికి ఆందోళనలు చేస్తున్నామని, బంద్ కు పిలుపునిచ్చామని వివరించారు.

కర్ణాటక ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచిదని అన్నారు. కేఆర్ ఎస్ డ్యాంలో నీరు చూసి తాము ఆందోళనలు చేస్తున్నామని, ఇలాగే నీరు వదిలేస్తే రానున్న రోజుల్లో మాకు మరింత కష్టాలు తప్పవని వాటళ్ నాగరాజ్ అన్నారు.












Click it and Unblock the Notifications