ఇక రోడ్డెక్కుతాం, పోరాటాలకు సిద్దం - బొత్సా అల్టిమేటం..!!
ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి- వైసీపీ కొత్త వ్యూహాలతో రాజకీయ కార్యాచరణ అమలు చేస్తున్నారు. కూటమి పైన వైసీపీ పోరాటాలు మొదలు పెట్టింది. వైసీపీని టార్గెట్ చేస్తూ కూటమి నేతలు రాజకీయ కార్యాచరణ కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో.. ప్రభుత్వానికి బొత్సా కీలక హెచ్చరిక చేసారు.
పంచదార్ల పవిత్ర కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారా యణ తీవ్రంగా తప్పుబట్టారు. పంచదార్ల గ్రామంలో ఉన్న ఫణిగిరి కొండపై కూటమి నేతలు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ వైసీపీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి నేతల అండదండలతోనే ఈ దోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే కూటమి నేతలు.. పవిత్రమైన ఈ కొండల విధ్వంసంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పంచదార్ల కొండ కోసం మేము పోరాటం చేస్తుంటే కుట్ర దాగి ఉందని మాట్లాడతారా?. ఏమి కుట్ర దాగి ఉందో కూటమి నేతలు చెప్పాలని డిమాండ్ చేసారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి ఈ కొండలను దారుణంగా దోపిడీ చేస్తున్నారని, ఇది చిన్న చిన్న వ్యక్తులు చేస్తున్న అక్రమ మైనింగ్ కాదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మైనింగ్ ఆపకుంటే రోడ్డెక్కుతాం
ఇదే సమయంలో పరోక్షంగా డిప్యూటీ సీఎం పవన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. "నిత్యం సనాతన ధర్మం గురించి మాట్లాడే కూటమి పెద్దలకు కళ్లు ఉంటే ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను వచ్చి చూడాలి. ఈ ధర్మ పోరాటం ప్రజా ఉద్యమంలా మారకముందే జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు. పవిత్రమైన కొండలను దోచుకుం టున్న కూటమి నేతలకు ఆ దేవుడి పాపం తప్పక తగులుతుందని హెచ్చరించారు. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రేపు (బుధవారం) సాయంత్రం లోగా కొండ పైన మైనింగ్ వాహనాలు కనిపిస్తే రోడ్డు పైనే ధర్నాలు చేస్తామని స్పష్టం చేసారు. ఈ విషయంలో ఎంత వరకైనా పోరాటానికి సిద్దమని బొత్సా స్పష్టం చేసారు. దీంతో.. ఇప్పుడు జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications