SIR: ఓటరు లిస్ట్‌లో మీ పేరు ఉందా? వెంటనే ఇలా చెక్ చేసుకోండి

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విస్తృతంగా సాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర విస్తృత తనిఖీ (ఎస్ఐఆర్) ప్రచారంలో భాగంగా, చాలామందిలో ఒకటే ఆందోళన వ్యక్తమవుతోంది. బూత్ స్థాయి అధికారులకు సమర్పించిన పత్రాలు సరిగ్గా ప్రాసెస్ అయ్యాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పరిష్కారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ఉపయోగపడే ఒక సౌలభ్యాన్ని ప్రజల ముందుకు తెచ్చింది. ఇంటర్నెట్ వసతి గానీ, ఖరీదైన స్మార్ట్‌ఫోన్ గానీ లేకుండానే.. చేతిలో ఉన్న సాధారణ కీప్యాడ్ ఫోన్ ద్వారా ఓటరు సమాచారాన్ని క్షణాల్లో నిర్ధారించుకునే వెసులుబాటు కల్పించింది.

How to Check Voter Name in SIR Electoral Roll via SMS Simple Step-By-Step Guide for Voter ID Verification

SMS పంపడం ఎలాగంటే..

ఇందులో భాగంగా మన ఓటు సర్ లో మన పేరు రిజిస్టర్ అయిందో లేదో తెలుసుకోవడం చాలా సింపుల్.

  • ముందుగా ఫోన్‌లోని మెసేజ్ ఓపెన్ చేయాలి
  • అక్కడ ECI అని టైప్ చేసి, ఒక స్పేస్ ఇచ్చి, మీ వద్ద ఉన్న ఓటరు గుర్తింపు కార్డులోని సంఖ్యను ఎంటర్ చేయాలి.
  • ఉదాహరణకు: ECI ABC1234567
  • అనంతరం ఈ మెసేజ్‌ను 1950 అనే హెల్ప్‌లైన్ నంబరుకు పంపాల్సి ఉంటుంది.

రిప్లై అనుసరించాల్సిన మార్గం

మెసేజ్ పంపిన కొద్దిసేపటికే మీ ఓటరు వివరాలు తిరుగు సందేశంలో కనిపిస్తే, మీ వివరాల నమోదు విజయవంతంగా పూర్తయినట్లే. ఒకవేళ ఏవైనా సిగ్నల్ సమస్యల వల్ల ఎలాంటి సమాధానం రాకపోతే కంగారుపడాల్సిన అవసరం లేదు. రిప్లై రానంత మాత్రాన పేరు నమోదు కాలేదని భావించలేము. అటువంటి సందర్భాల్లో నేరుగా సంబంధిత వార్డు లేదా గ్రామానికి చెందిన బిఎల్‌ఓ అధికారిని కలసి లిస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేయించుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

ఓటరుకు ముందస్తు తనిఖీ ఎంతో మేలు!

చాలామంది ప్రశాంతంగా ఉన్న సమయంలో ఓటరు నమోదును పట్టించుకోక, ఓటింగ్ రోజున ఓటరు కార్డు లేక లేదా జాబితాలో పేరు కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ విధమైన చిన్న SMS ప్రక్రియ ద్వారా ముందే నిర్ధారించుకుంటే, పోలింగ్ రోజున ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ రాజ్యాంగ హక్కును వినియోగించుకునే వీలుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+