OpenAI: వైజాగ్ కు టీసీఎస్ గుడ్ న్యూస్..! ఓపెన్ ఏఐ డేటా సెంటర్..!
భారత్ లో అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న ఓపెన్ ఏఐ(OpenAI) ముందుగా విశాఖపట్నం (Vizag), పూణే(Pune)లకు శుభవార్త చెప్పింది. భారత్ లో టీసీఎస్ తో కలిపి డేటా సెంటర్ల (Data Centres) ఏర్పాటుకు సిద్ధమవుతున్న ఓపెన్ ఏఐ.. ఈ మేరకు భూసేకరణతో పాటు ఇతర ప్రయత్నాలను జోరుగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా టీసీఎస్ విశాఖతో పాటు ఫూణేలోనూ ఓపెన్ ఏఐ డేటా సెంటర్ల కోసం భూముల్ని సేకరించింది. ఈ రెండు నగరాల్లో టీసీఎస్-ఓపెన్ ఏఐ సంయుక్తంగా డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాయి.
అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఓపెన్ ఏఐ భారత్ లో తమ కార్యకలాపాల్ని విస్తరించేందుకు టీసీఎస్ సాయం తీసుకుంటోంది. ఇందులో భాగంగా టీసీఎస్-ఓపెన్ ఏఐ సంయుక్త భాగస్వామ్యంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో ముందుగా విశాఖ, పూణేలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో టీసీఎస్ భూముల సేకరణ ప్రక్రియ పూర్తి చేసింది. అనంతరం ఓపెన్ ఏఐతో కలికి వరుసగా డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టబోతోంది.

ఏపీ సర్కార్ దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టీసీఎస్‌కు ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో 200 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ గూగుల్ ఇప్పటికే తన 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ నిర్మాణాన్ని ప్రారంభించింది. దీంతో పాటు ప్రస్తుతం టాటా కమ్యూనికేషన్స్ గా ఉన్న వీఎస్ఎన్ఎల్ ఆస్తులను విక్రయించే ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ నుండి పుణెలోని బోప్ఖేల్‌లో 88 ఎకరాల భూమిని టీసీఎస్ రూ.640.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ అమ్మకానికి జూన్ 30న వాటాదారుల ఆమోదం లభించిందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో ఈ రెండు నగరాల్లోనూ త్వరలో డేటా సెంటర్ల ఏర్పాటు ప్రారంభం కానుంది. గూగుల్-అదానీ, మెటా-రిలయన్స్ ఒప్పందాల తర్వాత, ఒక ప్రపంచ ఏఐ దిగ్గజానికి, ఒక భారతీయ సంస్థకు మధ్య కుదిరిన మూడవ ఒప్పందం టీసీఎస్- ఓపెన్‌ఏఐ డేటా సెంటర్ కావడం విశేషం.














Click it and Unblock the Notifications