కేంద్రానికి రాహుల్ 5 డిమాండ్లు- మోడీ రాయబారానికి సమాధానం..!

నీట్ సహా పలు జాతీయ పోటీ పరీక్షల అక్రమాలకు బాధ్యతగా కేంద్రమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ధర్మేంద్ర ప్రధాన్ ను కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. నిన్న పార్లమెంట్ మార్చ్ కు విద్యార్ధులు భారీ ఎత్తున తరలిరావడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్, భాష్పవాయువు ప్రయోగాలు జరిపారు. దీంతో భారీగా విద్యార్ధులు గాయపడ్డారు. వారిని ఇవాళ ఆస్పత్రుల్లో పరామర్శించిన విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi).. ఆ తర్వాత నేరుగా ఆందోళనలోకి దిగారు.

జంతర్ మంతర్ వద్ద నిరసనలు (CJP Protests) చేస్తున్న సీజేపీ నాయకులు, విద్యార్ధుల్ని కలిసి పరామర్శించిన రాహుల్ గాందీ.. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఇతర నేతలతో కలిసి ప్రధాని మోడీ నివాసం ముట్టడికి బయలుదేరారు. ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నేతలతో కలిసి బైఠాయించారు. దీంతో ప్రధాని నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గింది. రాహుల్ గాంధీతో చర్చల కోసం కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ను రాయబారానికి పంపింది.

Rahul Gandhi s 5 Demands to Centre Dharmendra Pradhan s Resignation HM Statement House Debate

దీంతో రాహుల్ గాంధీని కలిసిన జితేంద్ర సింగ్ వెంటనే ప్రధాని మోడీ నివాసం ముందు ఆందోళనను విరమించుకోవాలని కోరారు.
జితేంద్ర సింగ్ ప్రతిపాదనకు అంగీకరించిన రాహుల్.. కేంద్రానికి ఐదు షరతులు పెట్టారు. అందులో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, లోక్ సభలో హోంమంత్రి అమిత్ షా ప్రకటన, అలాగే సభలో నీట్ సహా పోటీ పరీక్షల వైఫల్యాలపై చర్చ, విద్యార్ధుల సమస్యల్ని కేంద్రం వినడం, నిన్న విద్యార్దులపై పోలీసుల దాడులపై విచారణకు ఆదేశించడం వంటి డిమాండ్లు ఉన్నాయి. వీటిని జితేంద్ర సింగ్ తిరిగి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, సమాధానం ఇస్తామని రాహుల్ కు చెప్పినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+