వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైమ్స్ నౌ సర్వే: నిన్న కాంగ్రెస్ గెలిచిన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీ హవా, కర్ణాటకలో హోరాహోరీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బీఎస్పీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఒంటరిగా విజయం సాధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ రాలేదు. బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. కానీ బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ గెలిచింది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీ హవా, ఛత్తీస్‌గఢ్‍‌లో కాంగ్రెస్

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీ హవా, ఛత్తీస్‌గఢ్‍‌లో కాంగ్రెస్

ఈ నేపథ్యంలో వచ్చే లోకసభ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ హవా ఉంటుందని అందరు భావిస్తున్నారు. కానీ రాహుల్ గాంధీకి ఊహించని షాక్ తగలనుంది. కేవలం ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే ఆ పార్టీకి ప్లస్ కానుంది. కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీయే ఎక్కువ సీట్లు గెలుచుకోనుందని తాజాగా టైమ్స్ నౌ ప్రీపోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే

ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 29 లోకసభ స్థానాలు ఉన్నాయి. సర్వే ప్రకారం... ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకోనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 23 సీట్లు గెలుచుకోనుంది. రాజస్థాన్‌లో 25 లోకసభ స్థానాలకు గాను యూపీఏ 8, ఎన్డీయే 17 సీట్లు గెలుచుకోనుంది. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం యూపీఏ 6, ఎన్డీయే 5 సీట్లు గెలుచుకోనుందని తేలింది. మొత్తంగా ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎన్డీయే 45 సీట్లు గెలుచుకుంటుండగా, కాంగ్రెస్ 20 సీట్లు మాత్రమే గెలవనుంది. అధికారంలో ఉన్న కర్ణాటకలోను బీజేపీ.. కాంగ్రెస్‌తో పోటీ పడుతోంది. చెరీ 14 సీట్లు గెలుచుకోనున్నారు.

బీజేపీపై వ్యతిరేకత కాదా

బీజేపీపై వ్యతిరేకత కాదా

ఈ ఫలితాలను బట్టి రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో వరుసగా మూడుసార్లు బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఓడిపోయిందని అర్థమవుతోందని అంటున్నారు. కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ లేదా నరేంద్ర మోడీలపై వ్యతిరేకత కాదని అర్థమవుతోందని అంటున్నారు.

English summary
As per the survey, the BJP is likely to win 23 seats and Congress - 6. In the 2014 Lok Sabha elections, the BJP led the tally with 27 seats while the Congress had won just two out of the total 29 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X