చంద్రబాబు: 2019 నేషనల్ గేమ్స్‌నెల్లూరులో ఉండొచ్చు!
హైదరాబాద్: 2019 నేషనల్ గేమ్స్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగే అవకాశముందా? అంటే అవుననే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2019లో జరగనున్న నేషనల్ గేమ్స్ గురించి మాట్లాడారు. నెల్లూరులో జరుపుతామని సంకేతాలు ఇచ్చారట.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూతురు దీపా వెంకట్ స్వర్ణభారతి ట్రస్ట్ నడుపుతున్నారు. ఈ ట్రస్ట్ 13వ వార్షికోత్సవానికి చంద్రబాబు, వెంకయ్య నాయుడు, జీఎమ్మార్ చీఫ్ గ్రంథి మల్లికార్జున రావు తదితరులు వచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 1978లో వెంకయ్య నాయుడు, తాను అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యామని అయితే, ఇరవై మంది సభ్యులు మినహాయించి అందరు కాంగ్రెసు పార్టీలో చేరారని, చేరని వారిలో వెంకయ్య నాయుడు ఒకరని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీకి సుదూర తీరప్రాంతముందని చంద్రబాబు అన్నారు. 14 పోర్టులు నిర్మించడం ద్వారా ఏపీ భారత్‌కు గేట్ వే అవుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications